డోంట్ వర్రీ.. ఉందిగా బెర్రీ!
బెర్రీ పండ్లు మనల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తాయి. రోగ నివారణ కంటే ముందు జాగ్రత్తే మేలని చెబుతారు వైద్య నిపుణులు. ఆ ప్రకారంగా పుల్లపుల్లని, తియ్యతియ్యని బెర్రీ ఫలాలు ఎంత తింటే అంత మేలు!
బెర్రీ పండ్లు మనల్ని పరిపూర్ణ ఆరోగ్యవంతుల్ని చేస్తాయి. రోగ నివారణ కంటే ముందు జాగ్రత్తే మేలని చెబుతారు వైద్య నిపుణులు. ఆ ప్రకారంగా పుల్లపుల్లని, తియ్యతియ్యని బెర్రీ ఫలాలు ఎంత తింటే అంత మేలు!

బ్లూ బెర్రీ
- రక్త ప్రసరణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- యాంటీ ఏజింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.
- క్యాన్సర్‌ను దూరంగా ఉంచుతుంది.
- మూత్రనాళ సమస్యలు దూరం చేస్తుంది.
- కంటి చూపును మెరుగుపరుస్తుంది.
- వాపుల్ని, గాయాల్ని మాన్పుతుంది.
- వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.

వైల్డ్ బ్లూ బెర్రీ
- మెదడు ఆరోగ్యానికి మంచిది.
- జీవక్రియను మెరుగు పరుస్తుంది.
- రక్తనాళ సంబంధమైన సమస్యలను తగ్గిస్తుంది.
- డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.
- క్యాన్సర్ ప్రమాదాన్ని అరికడుతుంది.
- అల్జీమర్స్‌ను అడ్డుకుంటుంది.
- మూత్రనాళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

రాస్ బెర్రీ
- కంటి చూపునకు మంచిది.
- మధుమేహాన్ని నియంత్రిస్తుంది.
- క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- మెదడును చురుకుగా ఉంచుతుంది.
- గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.
- జీర్ణక్రియకు మేలుచేస్తుంది.
- శరీరంలోని వ్యర్థాలను తొలగిస్తుంది.

బ్లాక్ బెర్రీ
- కంటి చూపునకు మేలు చేస్తుంది.
- చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతుంది.
- ఎముకల్ని బలోపేతం చేస్తుంది.
- పేగులను శుద్ధి చేస్తుంది.
- డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.
- క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
- నెలసరిని క్రమబద్ధం చేస్తుంది.
- రక్తనాళ వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది.

స్ట్రాబెర్రీ
- ఇమ్యూనిటీ ప్రసాదిస్తుంది.
- గుండె జబ్బుల ప్రమాదం తగ్గిస్తుంది.
- డయాబెటిస్, వాత రోగాలను నియంత్రిస్తుంది.
- క్యాన్సర్‌తో పోరాడుతుంది.
- జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
- బరువు తగ్గేలా చేస్తుంది. చర్మానికి నిగారింపు ఇస్తుంది.

క్రాన్ బెర్రీ
- గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది.
- మూత్రకోశ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
- వాపుల్ని తగ్గిస్తుంది.
- జీర్ణకోశ పనితీరు మెరుగు పరుస్తుంది.
- దంత సమస్యలు తగ్గిస్తుంది.
- వ్యాధి నిరోధకతను పెంచుతుంది.
- క్యాన్సర్‌ను అదుపు చేస్తుంది.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

