HomeGeneralThese Things You Should Never Put In The Toilet Or Washroom
Household Tips | ఈ వస్తువులను బాత్‌రూంలో ఉంచుతున్నారా? వెంటనే అలవాటు మానుకోండి
Bathroom
2/6
ప్రతిఒక్కరూ టూత్‌బ్రష్‌లను బాత్రూంలోనే పెట్టుకుంటారు. బాత్రూమ్‌లో పెట్టిన బ్రష్‌ను వాడడంతో అనారోగ్యానికి గురవుతారు. టూత్‌బ్రష్ కవర్ వాడడం వల్ల బ్యాక్టీరియా పెరగడానికి అనువుగా ఉంటుంది.
3/6
మేకప్ సామానులను బాత్‌రూం లో ఉంచుకోవడానికి సులభంగా ఉంటుంది. బయట తెరిచి పెట్టిన మేకప్ బ్రష్‌లపై టాయిలెట్ ఫ్లష్ చేసినప్పుడు హానికారక క్రిములు చేరుతాయి. గాలిలోని తేమ బ్యాక్టీరియా ఎదగడానికి సాయపడి నిజానికి బ్రష్‌ల మీదే పెరుగుతాయి. వీటిని బెడ్‌రూంలో పెట్టుకోవడమే మంచిది.
4/6
తేమ వాతావరణం మెటల్ బ్లేడ్లను ఆక్సీకరణం అయ్యేలా చేసి వాడకానికి ముందే తుప్పు పట్టేలా చేస్తుంది. ఎయిర్ టైట్ ప్యాకేజీలో మూయబడి ఉంటే తప్ప, సేవింగ్ వస్తువులను కొత్త ప్రదేశంలో ఉంచండి.
5/6
రేజర్ బ్లేడ్లలాగానే మీకెంతో ఇష్టమైన నగలు కూడా తేమ వల్ల పాడవుతాయి. చవకగా దొరికే గిల్టు నగలు, మెటల్ సీలలైతే తుప్పుపడుతాయి. నిజమైన వెండి, ఇంకో గదిలో మూసి ఉంచిన నగల పెట్టెలోకన్నా త్వరగా రంగు వెలిసిపోతుంది.
6/6
ఇష్టమైన పర్‌ఫ్యూమ్‌లను బాత్‌రూంలో ఎక్కువకాలం ఉంచితే చెడ్డవాసన వస్తుంది. ఆవిరి కక్కే షవర్ స్నానాల వల్ల పెరిగే ఉష్ణోగ్రత వల్ల పర్‌ఫ్యూమ్ పుల్లగా మారుతుంది. వాటిని బెడ్‌రూంలోని అలమరలో పెట్టుకోండి. అది కూడా ఎండ పడని చోట ఎంచుకోవాలి.