
తెలంగాణ మార్గదర్శి.. విజన్ ఉన్న నాయకుడు.. మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నగరమంతా సంబురాలు మిన్నంటాయి.

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా బీఆర్‌ఎస్ శ్రేణులన్నీ సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగస్వాములయ్యాయి.

దివ్యాంగులకు వాహనాలు, మహిళలకు కుట్టుమిషన్లతో పాటు రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు నిర్వహించారు.

హరితహారం మొక్కలు నాటి.. ఆట పోటీలు, సైకిల్ ర్యాలీలు చేపట్టారు. సర్వ మత ప్రార్థనలు నిర్వహించి..

సామాజిక మాధ్యమాల్లోనూ వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు.

మంత్రుల నుంచి మొదలుకుని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, సాధారణ కార్యకర్తల వరకు ఎవరికి వారు..

తమ పరిధిలో స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొని పేదలు, అసహాయులకు సాయం చేసి, ప్రత్యేక బహుమతులు అందించి వారి ముఖాల్లో నవ్వులు పూయించారు.

గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా 200 ఎలక్ట్రిక్ స్కూటీలను బీఆర్‌ఎస్ కార్యకర్తలకు అందజేస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్

మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా బంజారాహిల్స్ డివిజన్‌కు చెందిన బీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలకు 10 కుట్టుమిషన్లను పంపిణీ చేస్తున్న నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజున రక్తదానం చేస్తున్న ఐటీ ఉద్యోగులు

బీఆర్‌ఎస్ కార్యకర్తలకు ఎలక్ట్రిక్ స్కూటీలను బహుమతిగా ఇచ్చిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేస్తున్న ఏపీ రాష్ట్ర బీఆర్‌ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్

హైదరాబాద్ మహానగరంలో ఐటీ రంగం అభివృద్ధికి ఎంతో కృషి చేసిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతగా టెకీలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారని, సుమారు 1000 మంది దాకా రక్తదానం చేసినట్లు టీఎఫ్‌ఎంసీ అధ్యక్షుడు సత్యనారాయణ తెలిపారు.

తెలంగాణ భవన్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే బాల్కసుమన్, కార్పొరేషన్ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, బాలరాజు యాదవ్, గెల్లు శ్రీనివాస్ తదితరులు

థ్రిల్ సిటీలో వీడియో జర్నలిస్టులకు ఆరోగ్యబీమా కార్డులు అందజేస్తున్న మంత్రులు తలసాని, మహమూద్ అలీ

వేడుకల్లో పాల్గొన్న మంత్రి మహమూద్ అలీ, కార్పొరేషన్ చైర్మన్లు కోలేటి దామోదర్, గజ్జెల నాగేశ్

మంత్రుల నివాస సముదాయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి తన నివాసంలో మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్‌రెడ్డి, నల్లగొండ, యాదాద్రి-భువనగిరి జడ్పీ చైర్మన్లు బండా నరేందర్ రెడ్డి, ఎలిమినేటి సందీప్ రెడ్డి, ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిశోర్ కుమార్, కంచర్ల భూపాల్‌రెడ్డి, ఎన్. భాసర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఫైళ్ల శేఖర్‌రెడ్డి, రాష్ట్ర డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్ కుమార్, సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఒంటెద్దు నరసింహారెడ్డి, పార్టీ నేతలు నంద్యాల దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కొండాపూర్‌లోని రంగారెడ్డి జిల్లా దవాఖానలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంలో రక్తదానం చేస్తున్న ఎమ్మెల్యే గాంధీ

మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా షాద్‌నగర్ సమీపంలోని జహంగీర్ పీర్ దర్గాలో మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ బాబాఫసియుద్దీన్ చాదర్‌ను సమర్పించి.. ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

చింతల్ క్యాంపు కార్యాలయంలో వృద్ధురాలికి దుప్పట్లు, చేతి కర్రను పంపీణీ చేస్తున్న ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, చిత్రంలో తదితరులు.

పార్శిగుట్టలో మహిళలకు టమాటలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ముఠా గోపాల్, టి.సోమసుందర్, తదితరులు

తిరుమలగిరి హోలీ ఫ్యామిలీ పాఠశాలలో విద్యార్థులకు ఎగ్జామ్ కిట్స్ అందజేస్తున్న రాష్ట్ర మినరల్ డెవలప్‌మెంట్ చైర్మన్ మన్నె క్రిషాంక్

రెజిమెంటల్ బజార్‌లోని హిల్‌స్ట్రీట్ ప్రభుత్వ పాఠశాలలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నాగేష్ షూలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌కు గజ్జెల నాగేష్, పారిశుద్ధ్య కార్మికులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

మాదాపూర్ డివిజన్ పరిధిలో సుమారు 10 ప్రభుత్వ పాఠశాలలో రెండు వేల మంది విద్యార్థులకు 8 వేల నోటు పుస్తకాలను పంపిణీ చేసిన కార్పొరేటర్ వి.జగదీశ్వర్ గౌడ్, పూజిత గౌడ్

బీఆర్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిల్లా నాగయ్య ఆధ్వర్యంలో ఓయూ ల్యాండ్ స్కేప్ గార్డెన్‌లో కేటీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా తుంగతుర్తి ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్వీ, బీఆర్‌ఎస్‌వై నాయకులు, విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. అంతే కాకుండా ‘గిఫ్ట్ ఏ స్మైల్'లో భాగంగా విద్యార్థులకు గొడుగులను పంపిణీ చేశారు.

తార్నాక డివిజన్ లాలాపేటలో జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేస్తున్న డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి

ఓల్డ్ బోయిన్‌పల్లి డివిజన్ మల్లికార్జుననగర్‌లో మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా సోమవారం మహిళలకు చీరలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ నర్సింహ యాదవ్

మల్లాపూర్‌లో రక్తదానం చేసిన దాతలకు పండ్ల రసం తాగిస్తున్న ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, పాల్గొన్న కార్పొరేటర్ దేవేందర్‌రెడ్డి

ఆసిఫ్‌నగర్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సీహెచ్ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో సరోజినీదేవి కంటి దవాఖానలో పండ్ల పంపిణీ చేపట్టారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు, నాంపల్లి బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి సీహెచ్ ఆనంద్ కుమార్ గౌడ్‌తో పాటు బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

వాహనం అందించే కార్యక్రమంలో పాల్గొన్న బీఎల్‌ఆర్ ట్రస్ట్ సభ్యులు, బీఆర్‌ఎస్ నాయకులు, అభిమానులు, స్థానిక ప్రజలు

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఓ దివ్యాంగుడికి రూ.1.30 లక్షల విలువైన బైకును అందజేస్తున్న బీఎల్‌ఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు బండారి లక్ష్మారెడ్డి

కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం గోలివాడలో నిరుపేద గాదె రాజమ్మకు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నిర్మించి ఇచ్చిన ఇల్లు

మంత్రి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా తన సొంత నిధులతో బీఆర్‌ఎస్ కార్యకర్తలకు అందజేసిన ఎలక్ట్రిక్ స్కూటీలను హోంమత్రి మహమూద్ అలీతో కలిసి ప్రారంభిస్తున్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బర్త్‌డే సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బెలూన్లు ఎగుర వేసి, కేకు కట్ చేస్తున్న స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు

కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఢిల్లీలోని సీఎం నివాసంలో మొక్క నాటి సెల్ఫీ దిగుతున్న ఎంపీలు సంతోష్‌కుమార్, కే కేశవరావు, నామా నాగేశ్వరరావు, దీవకొండ దామోదర్‌రావు, రంజిత్‌రెడ్డి, సురేశ్‌రెడ్డి, బీబీపాటిల్, రాములు, వద్దిరాజు, పార్థసారథిరెడ్డి, బడుగుల

ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా బజార్‌హత్నూర్ మండలం డేడ్రా గ్రామంలో 5 ఎకరాల్లో మునగ మొక్కలు నాటిన పోడు పట్టా లబ్ధిదారులు

మంత్రి కేటీఆర్ సారథ్యంలో సాధించిన విజయాలను వివరిస్తూ బీఆర్‌ఎస్ నేత అలిశెట్టి అరవింద్ ఆధ్వర్యంలో బస్సుకు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఈ బస్సు సందడి చేసింది.

తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్వీ ఆధ్వర్యంలో కేకు కట్ చేసి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు తినిపిస్తున్న మంత్రి తలసాని. చిత్రంలో విప్ బాల్క సుమన్, గెల్లు, ఎర్రోళ్ల తదితరులు

కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని.. గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్ బొంతు శ్రీదేవి చర్లపల్లికి చెందిన మచ్చ ఎల్లయ్యకు రూ.80వేలతో టీస్టాల్, కిరాణా దుకాణాన్ని ఏర్పాటు చేయించి.. ఉపాధి కల్పించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, నాయకులు సత్తిరెడ్డి, నాగిళ్ల బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.