HomeGeneralKaleshwaram Water Entering Sriram Sagar Project Through Reverse Pumping From Mupkal Pump House
Photo Story | ఎదురెక్కి వస్తున్న కాళేశ్వరం జలాలను చూసి మురిసిపోతున్న రైతన్న..
Kaleswaram Water
2/12
వరద కాలువలో నీళ్లొచ్చుడంటే పైనుంచి కిందికి పారుడే జూసినం. పైకెక్కుడంటే వింతగ ఉన్నది. వానల్లేకుంటే పోచంపాడ్ ప్రాజెక్టుకు నీళ్లు అస్తయా? అనుకున్నం.
3/12
నీళ్లను ఎత్తిపోస్తరని చెబితే, చిన్న పనేమో అనుకున్నం. కానీ, గిదంతా జూస్తుంటే నమ్మలేకున్నం. మా కోసం, మా బతుకుల కోసం, మా సాగు పనుల కోసం సీఎం కేసీఆర్ గింతగానం పని చేస్తుంటే కండ్లపొంటి నీళ్లొస్తున్నయ్.
ప్రాజెక్టే ఆధునిక దేవాలయం. ప్రజల బతుకులను సౌభాగ్యంగా మార్చే నీళ్లే తీర్థం. ఇప్పుడలాంటి తీర్థయాత్ర శ్రీరాంసాగర్ ప్రాజెక్టువైపు నడుస్తున్నది.
6/12
వస్తాయో, రావోననుకున్న పోచంపాడుకు, కేసీఆర్ నిర్మించిన మానవాతీత ప్రాజెక్టు కాళేశ్వరం నుంచి జలాలు ఎదురెక్కి వస్తుంటే చూసి తీరాల్సిందేనంటూ రైతులంతా తరలివస్తున్నారు. బస్సుల్లో సమూహంగా పోచంపాడు బాట పట్టారు.
7/12
కొందరైతే తమ కోసం బస్సులు వేయాలని బీఆర్‌ఎస్ నాయకులను అడుగుతున్నారు. అసలే నిజామాబాద్‌లో రైతు చైతన్యం ఎక్కువ.
8/12
కాళేశ్వరం నీళ్లు తరలివస్తుంటే చూడకుండా ఉంటారా! ఈసారి పొలాలకు రావనుకున్న నీళ్లను రప్పించటం ఎలా సాధ్యమైందంటూ ఓవైపు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూనే, వాటిని చూసేందుకు ఆసక్తితో రైతు సంఘాల నాయకులు ప్రాజెక్టు వద్దకు వస్తున్నారు.
9/12
భవిష్యత్తుతో ఇక పోచంపాడుకు గోదావరి వరద వస్తదా? రాదా? కాల్వలకు నీళ్లు పారుతయా? అన్న అవసరమే లేదు కదా! అన్న ఆలోచన వారిని ఆశ్చర్యపరుస్తున్నది. వానకాలం సీజన్ మొదలై నెలన్నర గడిచి పోయింది.
10/12
ఇప్పటికే నాట్లు ముగియాల్సిన సమయం దాటిపోయింది. కానీ, ఈసారి కాలం కలిసిరాలేదు. చినుకు జాడ లేదు. గోదావరిలో వరద సవ్వడి లేదు. చుక్క నీరు లేక పంట పొలాలు బీళ్లుగా మారుతున్నాయి.
11/12
రైతాంగం నిరుత్సాహానికి గురవుతున్న వేళ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రూపంలో అన్నదాతలకు కొండంత అండ దొరికింది. ప్రకృతి ప్రకోపంతో వానలు కురియక పోయినప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటి తిప్పలను తీర్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు.
12/12
మేడిగడ్డ నుంచి కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోసి పునరుజ్జీవ పథకం ద్వారా ఎస్సారెస్పీ వరకు చేర్చుతున్నారు. రోజుకు అర టీఎంసీ చొప్పున వరదకాలువ ద్వారా కాళేశ్వరం జలాలు పరుగులు పెడుతూ శ్రీరాంసాగర్‌ను నింపుతున్నాయి.