Heavy Rains In Telangana State
ఆకాశానికి చిల్లు పడినట్లుగా నగరంలో ఎడతెరిపిలేకుండా వానలు కురుస్తున్నాయి.
రోజంతా కురిసిన వర్షాలతో ఈ సీజన్‌లోనే అత్యధిక వర్షపాతం నమోదయింది.
తెరిపివ్వని వానలకు పోటాపోటీగా జీహెచ్‌ఎంసీ అధికారులూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు.
పారిశుద్ధ్య సిబ్బందితో పాటు డీఆర్‌ఎఫ్ బృందాలు, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై వర్షం నీరు నిలువకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతూనే ఉన్నారు.
ముందస్తుగానే అప్రమత్తం అయిన అధికారులు పౌరుల ఫిర్యాదులపై తక్షణం స్పందిస్తూ పరిష్కారం చూపుతున్నారు.
ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలలో వేగంగా సహాయక చర్యలను చేపడుతున్నారు.
నగరంలోని చెరువులు, కుంటలలో వరద తాకిడిని అంచనా వేస్తూ దిగువకు నీరు వదులుతున్నారు.
అన్ని శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్, కమిషనర్ రోనాల్డ్‌రోస్ ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతూ తగు చర్యలు చేపడుతున్నారు.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం రాత్రి 7 గంటల వరకు 28 ప్రాంతాల్లో చెట్లు కూలిపోగా,
15 ప్రాంతాల్లో వాటర్ నిలిచి, మరో రెండు చోట్ల గోడ కూలిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి సహాయక చర్యలు చేపట్టినట్లుగా ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు.
ఇదిలా ఉంటే అత్యవసరం ఉంటేనే బయటకు రావాలని నగర పౌరులకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి విజ్ఞప్తి చేశారు.
జనగామ జిల్లా వెల్దండ-అమ్మాపురం రహదారిపై వరదనీటిలో ప్రజలను సురక్షితంగా కల్వర్టు దాటిస్తున్న స్థానికులు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలు సాగుకు జీవం పోస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ముసురువానలోనే ఉత్సాహంగా వరినాట్లు వేస్తున్న కూలీలు
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం సిర్నాపల్లిలోని శీలం జానకీబాయి చెరువు నిండి మత్తడి దుంకుతున్నది. 54 అడుగుల ఎత్తు నుంచి నీరు జాలువారుతుండగా, ఈ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది
భద్రాద్రి జిల్లా చర్ల మండలం పరిధి తాలిపేరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. 24 గేట్లు ఎత్తి 1,02,399 క్యూసెక్కుల నీటిని ప్రాజెక్ట్ అధికారులు దిగువకు వదిలారు
రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని కాముని చెరువు అలుగు పారుతున్నది. పైనుంచి పాల ధార పోసినట్టు కనిపిస్తున్నట్టుగా సందర్శకులను ఆకట్టుకుంటున్నది
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం బస్వాపూర్ బ్రిడ్జిపై నుంచి ఉధృతంగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగు
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పరవళ్లు తొక్కుతున్న మెదక్ జిల్లాలోని వనదుర్గా మధ్య తరహా ప్రాజెక్టు
జలకళను సంతరించుకున్న రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్‌లో వర్షంలో కవర్లు కట్టుకొని వరి నాట్లు వేస్తున్న కూలీలు
వానలకు చెరువుల్లో పెద్దపెద్ద చేపలు రాగా, మత్స్యకారులకు ఉపాధి లభించింది. సిద్దిపేట జిల్లా మద్దూరులో చేపలు కొంటున్న గ్రామస్తులు
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కానాయపల్లి స్టేజీ సమీపంలో ముసురు వానలో వరి నాట్లు వేసేందుకు కవర్లు కప్పుకొని వెళ్తున్న మహిళా కూలీలు
వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఇల్లంద ఎస్సీకాలనీ ఇండ్లలో చేరిన వరద నీరు
సిద్దిపేట జిల్లా సోలామైల్ వద్ద కొట్టుకుపోయిన జనగామ-సిద్దిపేట జాతీయ రహదారి
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి శివారులో నీట మునిగిన సోయా పంట
భద్రాచలంలో 43 అడుగులకు చేరిన గోదావరి ప్రవాహం
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో బోట్లతో సిద్ధంగా రెస్క్యూ ఆపరేషన్ సిబ్బంది
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో వాగు దాటించిన అనంతరం గర్భిణులతో డీఎంహెచ్‌వో అప్పయ్య, వైద్య సిబ్బంది
ములుగు దవాఖానలో మగ బిడ్డకు జన్మనిచ్చిన బాలింత ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న డీఎంహెచ్‌వో అప్పయ్య
భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలం కాకర్లలో కూలిన రేకులఇల్లు
వర్షం నీరు సాఫీగా వెళ్లేలా మ్యాన్‌హోళ్ల వద్ద చెత్తను తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్ బృంద సభ్యులు
వర్షం నీరు సాఫీగా వెళ్లేలా మ్యాన్‌హోళ్ల వద్ద చెత్తను తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్ బృంద సభ్యులు
వర్షం నీరు సాఫీగా వెళ్లేలా మ్యాన్‌హోళ్ల వద్ద చెత్తను తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ మాన్‌సూన్ బృంద సభ్యులు
తిరుమలగిరిలో ఓ రోడ్డుపై కూలిన చెట్టును తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులు
టెలిఫోన్ భవన్ వద్ద గొడుగులు పట్టుకున్న ప్రజలు
కూకట్‌పల్లి అంబేద్కర్ వై జంక్షన్‌లో పరిస్థితిని పరిశీలిస్తున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి, జడ్సీ మమత, ఎస్‌ఈ ఆనంద్
తెలుగుతల్లి ఫ్లైఓవర్ సమీపంలో..
లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వరద నీరు నిలవడంతో హెచ్చరికను ఏర్పాటు చేసి రాకపోకలు నిలిపివేసిన అధికారులు
వరదనీటిని తొలగిస్తున్న జీహెచ్‌ఎంసీ సిబ్బంది
కూరగాయలమ్ముతున్న వ్యాపారులు
హైటెక్స్ వద్ద..
పంజాగుట్ట చౌరస్తాలో భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు అక్కడే విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ శ్రావణ్ కుమార్ మ్యాన్‌హోల్ తెరిచి నీటిని తరలించారు. దీంతో ట్రాఫిక్‌లో చిక్కుకున్న అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు సాఫీగా ముందుకుసాగాయి.
అసెంబ్లీ రోడ్డులో కురుస్తున్న వర్షం..
దుర్గం చెరువు తీగల వంతెన వద్ద..
ఖైరతాబాద్‌లో కురుస్తున్న వర్షం
సికింద్రాబాద్‌లో..
ఖాజాగూడ రోడ్డు వద్ద..
బయోడైవర్సిటీ రోడ్డు..
రాయదుర్గం రోడ్డు ..