Cm Kcr
వడగండ్ల వానతో నష్టపోయిన అన్నదాతలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలబడ్డారు.
గురువారం సుడిగాలి పర్యటన చేసి ‘రైతన్నా.. నేనున్నా..’ అని భరోసానిచ్చారు.ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలను చుట్టేసి, నష్టపోయిన పంటలను కండ్లారా చూసి కర్షకుల కన్నీళ్లు తుడిచారు.
రైతులను ఆత్మీయంగా పలుకరిస్తూ ఆపన్నహస్తం అందించారు. ఉదయం నుంచి జిల్లాల పర్యటనలోనే ఉన్న సీఎం.
అలుపెరుగకుండా, అవిశ్రాంతంగా రైతుల కోసం ముందుకు కదిలారు.
మధ్యాహ్న భోజనాన్ని కూడా మంత్రులతో పాటు కాన్వాయ్‌లోనే చేయడం గమనార్హం.
తానూ రైతు బిడ్డనేనని.. వ్యవసాయాన్ని కిందపడనీయనని చెప్తూ..వడగండ్ల బాధిత రైతులకు ఎకరాకు రూ. 10 వేలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
రైతులకు ఇచ్చేది నష్టపరిహారం కాదని.. పునరావాసం మాత్రమేనని చెప్పారు. తక్షణమే జీవో ఇచ్చి రైతులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కౌలు రైతులను కూడా కడుపులో పెట్టుకుంటామని, వారిని ఆదుకునే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించారు.
మహబూబాబాద్ జిల్లా పెద్ద వంగర మండలం, రెడ్డికుంట తండాలో పంట నష్టపోయిన రైతు సోమానాయక్‌ను ఓదార్చుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురంలో దెబ్బతిన్న పంటను పరిశీలించేందుకు వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నమస్కరిస్తున్న రైతులు. చిత్రంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి తదితరులు
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం గార్లపాడులో సీఎం కేసీఆర్‌కు రైతుల సమస్యలు వివరిస్తున్న గ్రామ సర్పంచ్ దారెల్లి నర్సమ్మ
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో పంటల నష్టానికి సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటోలను సీఎం కేసీఆర్‌కు చూపిస్తూ వివరిస్తున్న రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్. చిత్రంలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల గ్రామంలో దెబ్బతిన్న మక్కలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రులు సింగిరెడ్డి, పువ్వాడ, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామంలో దెబ్బతిన్న వివిధ రకాల పంటలను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంట తండాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసేందుకు తరలివచ్చిన స్థానికులు
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవిరంగాపురంలో రాలిన టమాటలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. చిత్రంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో దెబ్బతిన్న ద్యావ రాంచంద్రారెడ్డికి చెందిన డ్రాగన్‌ఫ్రూట్ తోటను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్.
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో రైతు ఎడవెల్లి రాజిరెడ్డి మామిడి తోటలో రాలిన మామిడి కాయలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్. చిత్రంలో మంత్రులునిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటలో మక్కజొన్న రైతుజాటోత్ చిన్న సోమ్లానాయక్‌తో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
రెడ్డికుంటలో జాటోత్ నెహ్రూనాయక్‌కు చెందిన మామిడి తోటను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో ఎర్రబెల్లి దయాకర్‌రావు.
మహబూబాబాద్ జిల్లా రెడ్డికుంట తండాలో బస్సులోనే పెరుగన్నం తింటున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు
కొసరి కొసరి వడ్డిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు. భోజనాలు చేస్తున్న ఎంపీ సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సీఎంవో ముఖ్య కార్యదర్శి స్మితాసబర్వాల్ తదితరులు
మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోమాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో రాళ్లవానకు దెబ్బతిన్న వట్టికోట రామకృష్ణకు చెందిన మక్క పంటను పరిశీలిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని, కూనంనేని
ఖమ్మం జిల్లాలో పంట నష్టం గురించి సీఎం కేసీఆర్‌కు వివరిస్తున్న మంత్రి నిరంజన్‌రెడ్డి
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం రెడ్డికుంటతండాలో వడగండ్ల వానకు దెబ్బతిన్న మిర్చి పంట రైతుకు ధైర్యం చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్
మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్, చిత్రంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్, మాజీమంత్రులు కడియం శ్రీహరి, రెడ్యానాయక్ తదితరులు
ఖమ్మం జిల్లాలో పంట నష్టం వివరాలు తెలుసుకుంటున్న సీఎం కేసీఆర్
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురంలో రైతు నుంచి పంట నష్టం వివరాలను తెలుసుకుంటూ..
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్‌లో వరి పంట నష్టపోయిన రైతు బండారి శంకర్‌గౌడ్ నుంచి వివరాలు తెలుసుకుంటున్న సీఎం కేసీఆర్
ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎస్ శాంతికుమారికి పంట నష్టంపై ఆదేశాలు ఇస్తున్న సీఎం కేసీఆర్, చిత్రంలో మంత్రి పువ్వాడ అజయ్
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం అడవి రంగాపురంలో వడగండ్ల వానకు దెబ్బతిన్న మక్కజొన్న కంకులను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలో మామిడి తోటలో రాలిన కాయలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్, పక్కన మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతలలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంటనష్టం గురించి వివరిస్తున్న మొక్కజొన్న రైతు
కరీంనగర్ జిల్లాలో జరిగిన పంటనష్టంపై ఫొటోలను తిలకిస్తున్న సీఎం కేసీఆర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్‌పల్లి వినోద్‌కుమార్, మంత్రి గంగుల కమలాకర్, తదితరులు
ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్
ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్
ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వర్షప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్