శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Gadwal - Jan 31, 2020 , 01:54:57

పల్లె ప్రగతి పనులు వేగిరంగా పూర్తి చేయండి

పల్లె ప్రగతి పనులు వేగిరంగా పూర్తి చేయండి

అయిజ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులను వేగిరంగా పూర్తి చేయాలని శిక్షణ కలెక్టర్‌ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. గురువారం మం డలంలోని ఉత్తనూర్‌, భూం పురం, టీటీదొడ్డి, సింధనూర్‌, బింగిదొడ్డి గ్రామాలలో పల్లె ప్రగతి పనులను శిక్షణ కలెక్టర్‌ పరిశీలించారు. ప్రతి గ్రామంలో డంపిం గ్‌ యార్డు, వైకుంఠ ధామం, ఇంకుడు గుంతల నిర్మాణాలను శరవేగంగా చేపట్టిన పూర్తి చేయా లన్నారు. గ్రామాలలోని వీధులను పరిశుభ్రంగా ఉంచేందు కు చర్యలు తీసుకో వాలన్నారు. పల్లెల పరిశుభ్రతతోనే వ్యాధులు దూరమవుతున్నాయన్నారు. 


వచ్చే జూన్‌ మాసంలో చేపట్టనున్న తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో మొక్కలను నాటేందుకు నర్సరీలలో మొక్కలను పెంచాలన్నారు. ప్రతి నర్సరీ లో పంచాయతీకి అవసరమైన మొక్కలను పెంచేందుకు చర్యలు తీసు కోవాలన్నారు. నర్సరీలలో మొక్కల పెంపునకు ప్రత్యేక చొరవ తీసుకోవా లన్నారు. పల్లె ప్రగతి పనులను నిర్లక్ష్యం చేస్తే సహించేదిలేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమణారావు, ఎంపీ వో నర్సింహారెడ్డి, సర్పంచ్‌లు, టీఏలు, ఎఫ్‌ఏలు పాల్గొన్నారు. 


పల్లె ప్రగతి పనులపై సమీక్ష 

పట్టణంలోని మండల పరిషత్‌ కార్యాలయంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించి పల్లె ప్రగతి పనులపై శిక్షణ కలెక్టర్‌ శ్రీహర్ష సమీక్ష చేశారు. ప్రతి గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణాలు, ఇంకుడు గుంతలు, డంపింగ్‌ యార్డు లు, వైకుంఠ ధామాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చే యాలని ఆదేశించారు. పనులు పూర్తి చే య డంలో అలసత్వం ప్రదర్శిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. గ్రామ పంచాయతీల ద్వారా కరెంట్‌ బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకో వాలన్నారు. కరెంట్‌ బిల్లుల చెల్లింపులపై నివేదికను అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమణారావు, ఎంపీవో నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్‌ సాయిప్రకాశ్‌ పాల్గొన్నారు. 


logo