మంగళవారం 19 జనవరి 2021
Food - Sep 24, 2020 , 00:08:09

గోంగూర చికెన్‌ (ఇమ్యూనిటీ ఫుడ్‌)

గోంగూర చికెన్‌ (ఇమ్యూనిటీ ఫుడ్‌)

కావాల్సిన పదార్థాలు

చికెన్‌: కప్పు

గోంగూర: కప్పు

గసగసాలు: 50 గ్రా.

జీడి పప్పు: 10 గ్రా.

నూనె: సరిపడా

ఉల్లిపాయలు: అర కప్పు

కారం: టేబుల్‌ స్పూను

పచ్చిమిర్చి: 4

పసుపు: టీ స్పూను

ధనియాల పొడి: టీ స్పూను

గరం మసాలా పొడి: టీస్పూను

ఉప్పు: తగినంత

తయారు చేసే విధానం: 

గసగసాలు, జీడిపప్పును కలిపి మెత్తగా గ్రైండ్‌ చేయాలి. పాత్రలో నూనె వేడి చేసి ఉల్లిపాయ ముక్కలను వేయించిన తర్వాత అందులో పచ్చిమిర్చి, కారం, పసుపు, ధనియాల పొడి, గరంమసాలా పొడి ఒకదాని తర్వాత ఒకటిగా వేయాలి. తర్వాత చికెన్‌ వేసి తగినంత నీటిని పోసి ఉడికించాలి. చికెన్‌ ఉడికిన తర్వాత గోంగూర, గసగసాలు, జీడిపప్పు మసాలా వేసి ఉడికిస్తే గోంగూర చికెన్‌ రెడి.