Meenakshi | అందరిలా ఆమెకు బాల్య జ్ఞాపకాలు లేవు. అమ్మానాన్నలతో సరదాగా ఆడుకున్న ఆనవాళ్లు లేవు. పుట్టినప్పటి నుంచీ నాలుగు గోడల మధ్యే బతికింది. తలెత్తి ఆకాశం వైపు కూడా చూడలేదు. కిటికీ తెరిచి బయటి ప్రపంచాన్ని వీక్షించలేదు. ఆమెకు తెలిసిందల్లా.. ఒక నర్సు.. చేతిలో ఇంజెక్షన్.. పక్కన అమ్మమ్మ. పదహారేండ్లు వచ్చే వరకూ ఇదే జీవితం. దానికి తోడు.. ఆమె శరీరమే ఒక ప్రయోగశాలగా మారిపోయింది. 26 శస్త్రచికిత్సలతో ఛిద్రమైపోయింది. అయినా ఆమెలో ఆశావాదం చచ్చిపోలేదు. ఓ విదేశీ సంస్థలో గ్రాఫిక్ డిజైనర్‌గా జీవితాన్ని ప్రారంభించి.. వందమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది మీనాక్షి. ఆ మలుపులన్నీ ఆమె మాటల్లోనే .. వీడియో