Vijay Devarakonda | ‘గీత గోవిందం’ (Geetha Govindham) చిత్రంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) కు భారీ హిట్ చిత్రాన్ని అందించారు దర్శకుడు పరశురామ్ (Parashuram petla). వీరిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (#SVC54) పతాకంపై వస్తున్న ఈ చిత్రాన్ని దిల్రాజు – శిరీష్ నిర్మించబోతున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ని (#VD13 Update) మేకర్స్ ప్రకటించారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు (Pre Productions Works) జరుపుకుంటున్న ఈ మూవీ టీం.. లొకేషన్స్ కోసం ఇటీవల అమెరికా పర్యటనకు వెళ్లింది. తాజాగా అక్కడ లొకేషన్ల రెక్కీ పూర్తయిందని.. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభించనున్నట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దానితో పాటు చిత్రబృందం ఒక ఫోటోని కుడా షేర్ చేసింది. ఈ మూవీలో విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) కథనాయికగా నటిస్తుండగా.. గోపి సుందర్ (Gopi Sundhar) ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం #ఖుషి, #VD12, #VD13 సినిమాలు చేస్తుండగా.. వీటిలో ఖుషీ మూవీ (Kushi Movie) షూటింగ్ ఇటీవల కంప్లీట్ (Shooting Wrapped Up) చేశాడు. ఈ సినిమా సెప్టెంబర్ 1న విడుదల కాబోతుంది. అలాగే గౌతమ్ తిన్ననూరి (Gautham Tinnanuri) దర్శకత్వంలో వస్తున్న #VD12 కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈ సినిమా స్పై యాక్షన్ (Spy Action) థ్రిల్లర్గా రాబోతుంది.
USA Recce ✅
All set to hit the floors soon😀#VD13 – #SVC54 ✨ @TheDeverakonda #MrunalThakur @svc_official#KUMohanan @GopiSundarOffl #ASPrakash #MarthandKVentakesh #VasuVarma #DilRaju #Shirish pic.twitter.com/tvzDgo7UqQ
— Parasuram Petla (@ParasuramPetla) July 8, 2023