కలెక్షన్స్ కాదు ప్రేమ ముఖ్యం

‘సినిమా కలెక్షన్స్ కంటే అభిమానుల ప్రేమ నాకు ముఖ్యం. కరోనా మహమ్మారి కారణంగా ఉత్తరాదితో పాటు పలు రాష్ర్టాల్లో సినిమా ప్రదర్శనలు నిలిచిపోయాయి. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం సంక్రాంతికి సినిమాను విడుదలచేస్తే చూస్తామని భరోసా ఇచ్చారు. సినిమాను బ్లాక్బస్టర్ చేశారు’ అని అన్నారు నాగార్జున. నాగచైతన్యతో కలిసి ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బంగార్రాజు’. కల్యాణ్కృష్ణ కురసాల దర్శకుడు. నాగార్జున నిర్మించారు. ఇటీవలే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మంగళవారం ఏపీలోని రాజమండ్రిలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ‘సినిమా అంటే సంక్రాంతి..సంక్రాంతి అంటే సినిమా అని తెలుగు ప్రేక్షకులు మరోసారి నిరూపించారు. ఏపీ సీఏం జగన్తో జరిపిన భేటీ గురించి నా మిత్రుడు చిరంజీవిని అడిగా. సినిమా ఇండస్ట్రీకి అంతా మంచి జరుగుతుందని ఆయన చెప్పారు. అచ్చమైన తెలుగు సినిమాగా ‘బంగార్రాజు’ అందరినీ అలరిస్తున్నది’ అని అన్నారు. ‘కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నా కథపై నమ్మకంతో సినిమాను విడుదలచేశాం. నాన్నతో పాటు నా కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ను ఈ సినిమా రాబట్టింది’ అని నాగచైతన్య చెప్పారు. ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ ‘నాగార్జున ఓ ఆల్రౌండర్, అన్నమయ్య, రామదాసు లాంటి సినిమాలతో తన జన్మను ధన్యం చేసుకున్నారు. నాగచైతన్య వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. కుటుంబ విలువలను ఈ సినిమాలో చక్కగా చూపించారు’ అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ మంత్రి కన్నబాబు, ఎంపీ భరత్, కృతిశెట్టి పాల్గొన్నారు.
Read Today's Latest Entertainment News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

