యుద్ధాచారం!
యుద్ధం గెలుపోటములను మాత్రమే ఇస్తుందా ? ఆవిరైపోని కన్నీళ్ళని కుళ్ళి కుళ్ళి ఏడ్చే అమ్మల్ని కలలు విరిగిన అమ్మాయిలను పొత్తిళ్లలోనే పొర్లే చిన్నారి అనాథలను కూడా ఇస్తుంది
యుద్ధం గెలుపోటములను మాత్రమే ఇస్తుందా ?
ఆవిరైపోని కన్నీళ్ళని
కుళ్ళి కుళ్ళి ఏడ్చే అమ్మల్ని
కలలు విరిగిన అమ్మాయిలను
పొత్తిళ్లలోనే పొర్లే
చిన్నారి అనాథలను కూడా ఇస్తుంది
టపాకాయల్లాగా పేలే శరీరాలు
పాల కోసం పసిపేగుల ఆర్తనాదాలు
అష్ట దిక్కులూ దిగ్బంధమై
దారీతెన్నూ తెలియక
మెట్రో స్టేషన్లలోకి పరుగెత్తిన పాదాలు
ఎటువెళ్లాలో తెలియక
గమ్యం మరిచిన వాహనాలు
ఏ క్షణమైనా ఆగిపోయే గుండె చప్పుళ్ళు
నిర్జన షాపింగ్ మాల్లు..
నడకలన్నీ స్తంభించిన నగర జంక్షన్లు
ఖాళీ అయిన మార్కెట్లు..
టాప్ ఫ్లోర్లోనే ఆగిపోయిన ఎలివేటర్లు
ఇప్పుడిక్కడ పచ్చని పచ్చిక బయళ్లు కూడా
భయంతో వణుకుతున్నాయి
క్షణానికి వంద బాంబుల మోతతో
ఎడతెగని సుదీర్ఘ రాత్రులు
తెల్లవారి చూస్తే వాకిట అంతా రక్తకళ్ళాపి
మంచు దారుల గుండా గడ్డకట్టిన నిర్జీవ దేహాలే…
అమ్మ ఎవరికైనా దేవతే
దేశం ఎవరికైనా స్వర్గమే
వాడెవడి ఆధిపత్య ఆవేశానికో
పుట్టిన నేలే బీటలు వారుతుంటే
నడిచిన భూమే బద్దలవుతుంటే
బొడ్డు పేగు సైతం బిక్కు బిక్కుమనదా?
దిలాసాగా తిరిగిన వీధులన్నీ
రాత్రికి రాత్రే పరాయివైతే
మెదడులోని న్యూరాన్లు సైతం నిశ్చలమైపోవా?
ఇప్పటిదాకా ఆడబిడ్డల మీద
అనాచారాలు, అత్యాచారాలు,
దురాచారాల పీడననే చూశాం..
శతాబ్దాల కాలంగా ప్రపంచ పటం సాక్షిగా
మరో ఆచారం రెక్క విప్పుకున్నది
లాభ నష్టాలు ఏవైనా..
యుద్ధాచారం ఇది !
అంతిమ బాధితురాలు మాత్రం ఆడదే!
నిజానికి యుద్ధం.. ఓ భౌగోళిక అత్యాచారం!
– ఐనంపూడి శ్రీలక్ష్మి
99899 28562
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- Alive
- destruction
- life
- war
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

