ఇండియా రియాక్ట్స్
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే ఓటరు’ అని డైలాగును మార్చుకోవచ్చు కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో. నిజంగానే బీజేపీ మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాన్నిచ్చింది కన్నడ ప్రజానీకం. బీజేపీ అగ్ర ద్వయం నరేంద్రమోదీ, అమిత్ షా ఎన్ని పాచికలు విసిరినా, లక్ష్యాన్ని తప్ప మరొకటి చూడని అర్జునిడిలాగా తన తీర్పును విస్పష్టంగా ప్రకటించింది.
‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో వాడే ఓటరు’ అని డైలాగును మార్చుకోవచ్చు కర్ణాటక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో. నిజంగానే బీజేపీ మైండ్ బ్లాంక్ అయ్యే ఫలితాన్నిచ్చింది కన్నడ ప్రజానీకం. బీజేపీ అగ్ర ద్వయం నరేంద్రమోదీ, అమిత్ షా ఎన్ని పాచికలు విసిరినా, లక్ష్యాన్ని తప్ప మరొకటి చూడని అర్జునిడిలాగా తన తీర్పును విస్పష్టంగా ప్రకటించింది. ఉత్తరాది మత చిచ్చు రాజకీయాలు, ఆధిపత్య ధోరణులు దక్షిణాదిలో నడువబోవని.. పనితీరు ఆధారంగానే, ప్రతిభ ఆధారంగానే మార్కులు వేస్తామని తెలిపిన తీర్పు ఇది. తమ బలాన్ని అతిగా ఊహించుకొని, తమకు ఎదురేలేదని విర్రవీగుతున్న మోదీ-షాలను అతి సాధారణ ప్రజలు ఓటు అనే వజ్రాయుధంతో మట్టికరిపించగలరని నిరూపించిన తీర్పు ఇది. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా.. ‘భారతదేశం ఊరకే కూర్చోదు. అవసరం వచ్చినప్పుడు స్పందించి తీరుతుంది. ఇండియా రియాక్ట్స్’ అనే మాటలకు నిదర్శనం ఈ తీర్పు.
బీజేపీకి చెంపపెట్టు వంటి ఈ ఫలితం పూర్తిగా ఆ పార్టీ స్వయంకృతాపరాధం. 40 శాతం కమిషన్ సర్కార్ అని బొమ్మై ప్రభుత్వంపై విమర్శలు వచ్చినా ఆ పార్టీ దిద్దుబాటు చర్యలు తీసుకోలేదు. సర్కారు పెద్దల బారి నుంచి కాపాడాలంటూ ఏకంగా రాష్ట్ర కాంట్రాక్టర్ల సంఘం ప్రధాని మోదీకి లేఖ రాసినా స్పందించలేదు. అమాత్యులు కోరుకున్నంత సొమ్ము ఇవ్వలేక కాంట్రాక్టర్లు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడుగానీ, మంత్రుల ఇళ్లలో, వారి కుటుంబ సభ్యుల వద్ద అక్రమ ధనం కుప్పలు తెప్పలుగా వెలుగు చూసినప్పుడుగానీ బీజేపీ చర్యలు తీసుకోలేదు. పైగా, ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేస్తూ, మతం మాయాజాలాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసింది. హిజాబ్, హలాల్, ఆజాన్, టిపు సుల్తాన్ వంటి లేనిపోని అంశాల్ని తీసుకొచ్చి, ప్రభుత్వ వైఫల్యాల నుంచి జనం దృష్టి మరలిద్దామని భావించారు. పోలింగ్ చివరి నిమిషం వరకూ దీనినే నమ్ముకున్నారు. ఓటు వేసే ముందు జై బజరంగ్ బలి అనాలని ప్రధాని పదవిలో ఉన్న నరేంద్రమోదీ తన స్థాయి మరిచి పిలుపునివ్వటం చూసి జనం విస్తుపోయారు. చివరికి విశ్వరూపం చూపించారు. బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టారు.
రెండేండ్ల కిత్రం పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ ఈ విధమైన వ్యూహాన్నే అనుసరించింది. బెంగాలీలు గట్టిగా బదులిచ్చారు. అయినప్పటికీ, ఆ పార్టీ తీరు మారలేదని కర్ణాటక ఎన్నికల సమయంలో వారి ప్రచార సరళి నిరూపించింది. మారే అవకాశం కూడా లేదని మోదీ-షాల హయాంలో బీజేపీ వ్యవహరిస్తున్న పద్ధతులను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇక మారాల్సింది, మార్చాల్సింది జనమే. కర్ణాటక తీర్పు దీనినే స్పష్టం చేస్తున్నది. భ్రమల్లో విహరిస్తున్న బీజేపీని నేల మీదికి దించారు. కాంగ్రెస్‌కు పగ్గాలు అప్పగించారు. అయితే, కన్నడిగుల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందా? అవినీతి, ఆశ్రిత పక్షపాతం, పాలనాపరమైన అసమర్థత వంటి బీజేపీ హయాంలోని దుర్లక్షణాల్ని దరి చేయనీయకుండా, నిక్కమైన పాలనను అందించగలదా? ప్రజలు విస్పష్టమైన తీర్పునిచ్చినా, ముఖ్యమంత్రి పదవి గురించి కీచులాడుకుంటున్న కాంగ్రెస్‌లో ఇంకా పాత వాసనలు పోలేదని అర్థమవుతున్నది. కాంగ్రెస్ మారకపోతే ప్రజాక్షేత్రంలో ఆ పార్టీకీ శిక్ష తప్పదు.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

