బతుకులు ఇంటికి ఆఫీస్‌కి Shuttle Service అయ్యాక ట్రాఫిక్‌ను పాక్కుంటూ వచ్చి గడపలో కూలబడటం తప్ప తల ఎత్తి చూసింది లేదు పైన ఆకాశం ఉందో లేదో అక్కడ చంద్రుడు ఉన్నాడో లేడో…
జీవులు అపార్ట్మెంట్ పంజరంలో చిలుకల్లా ఇరుక్కుని కళ్ళన్నీ టీవీలకు అతికించాక ఎవరూ డాబా పైకి ఎక్కి చూసింది లేదు ఏమో ఆకాశం ఉందో లేదో
అక్కడ చంద్రుడు ఉన్నాడో లేడో…
అమ్మ ఇప్పుడు బుల్లెట్ బండి పాట మొబైల్లో చూపెట్టి బువ్వ తినిపిస్తుంటే.. పిల్లలకు అద్దం తెలియదు.. ఆకాశం తెలియదు.. అక్కడ చంద్రుడున్నాడో లేడో…
విద్యార్థులు ipodలో మునిగి ర్యాంకులు తోడుతున్నారు ఆరు బయట ఆటలు Byju అంకుల్ ఎత్తుకెళ్లాడు పైన ఆకాశం ఉందో లేదో అక్కడ చంద్రుడు ఉన్నాడో లేడో.. అడిగితే Googleలో వెతుకుతున్నారు!
మనుషులు పైసల మాయలో పడి పక్కవాళ్ళతో పోటీకి పోయాక జీవితం కళలు కోల్పోయి అనుభూతులు ఆవిరయ్యాయి అందర్నీ లెక్కలు కమ్ముకున్నాయి చంద్రుడు చల్లగా తప్పుకున్నాడు వెన్నల క్రమక్రమంగా కనుమరుగయ్యింది..!
-దాసరి మోహన్
99853 09080