‘ప్రత్యేకం’ ఎందుకు?
అచ్చెర, పాయెర.. అనే చందంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వోన్నత చట్టసభలను నిర్వహించే విషయంలో కేంద్ర ప్రభుత్వ ధోరణిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అచ్చెర, పాయెర.. అనే చందంగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్వోన్నత చట్టసభలను నిర్వహించే విషయంలో కేంద్ర ప్రభుత్వ ధోరణిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసాధారణ పరిస్థితుల్లో, అత్యవసర సమయాల్లో ప్రత్యేక సమావేశాలకు పిలవడం పరిపాటి. కానీ ఈసారి తలపెట్టిన సమావేశాల ఉద్దేశాలపై ఊహాగానాలు జరుగుతున్నాయే తప్ప అసలు సంగతి బయటకు రావడం లేదు. పార్లమెంటు నిర్వహణ పారదర్శకంగా జరగాలనే నియమానికి ఇది పూర్తి విరుద్ధం. ఈ నెల 18-22 తేదీల్లో ప్రత్యేక సమావేశాలు జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ గతవారం హడావుడిగా ప్రకటించారు. అయితే ఆ సమావేశాల ఎజెండా ఏమిటో ఆయన వెల్లడించలేదు. రోజుకొక లీకుతో కేంద్రం గందరగోళం సృష్టిస్తున్నది. దీంతో ఎవరికి తోచినవిధంగా వారు అర్థాలు తీస్తున్నారు. జమిలి ఎన్నికల చట్టం తెస్తారని కొందరు, దేశం పేరు మార్చే చట్టం చేస్తారని మరికొందరు చెప్పుకొంటున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఓటమి భయంతో తమ వైఫల్యాల మీద నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఈ హంగామా చేస్తున్నదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. ఆ మాట అలా ఉంచితే జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన కేంద్రం ఓ కమిటీని వేసింది. ఇలా ఆగమేఘాలపై కమిటీని వేయడం కేంద్రం తాను అనుకున్న జమిలి విధానాన్ని నెగ్గించుకునేందుకే అని అంటున్నారు. ఈలోగా దేశం పేరు మార్పుపై చర్చకు తెరదీశారు. జీ-20 సదస్సు అతిథుల ఆహ్వానపత్రంపై ‘ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’ బదులుగా ‘ప్రెసిడెంట్ ఆఫ్ భారత్’ అని వేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇంగ్లిష్‌ను పక్కనపెట్టి హిందీని రుద్దాలనేది బీజేపీ పరివార్ ప్రగాఢమైన కోరిక అనేది తెలిసిందే. ఇప్పుడు కొత్తగా దేశానికి ‘భారత్’ అని పేరు పెట్టడమేమిటి? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. నిజానికి రాజ్యాంగం అవతారికలోనే ‘ఇండియా దటీజ్ భారత్’ అని ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఆ ఇండియా అనే పేరును తొలగించాలని భావిస్తున్నట్టుంది. పోనీ ఆ సంగతి అయినా ప్రభుత్వం చెప్తే బాగుండేది.
పార్లమెంటు అంటే పాలకపక్షం మాత్రమే కాదు కదా? విపక్షమూ ఉంటుంది. సభా వ్యవహారాల కమిటీ ఉంటుంది. ఆ కమిటీలోని వివిధ పక్షాల నేతలతో సంప్రదింపులు జరిపి తేదీలు, చర్చాంశాలు వంటివి నిర్ణయించవచ్చు. పాలకపక్షం, విపక్షం అనే రెండుచక్రాల మీద నడుస్తుంది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. కానీ విపక్షాన్ని సంప్రదించే సంప్రదాయం పాటించే ఉద్దేశమేదీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి లేదన్నది స్పష్టమైపోయింది. అంటే ఈ సమావేశాలకు సభ్యులు దేని గురించి, ఏం మాట్లాడాలో తెలియకుండానే పార్లమెంటుకు రావాలన్న మాట. చర్చించాలంటే నిజానికి చాలా సమస్యలే ఉన్నాయి. ఉదాహరణకు మణిపూర్ హింసాకాండ, మహిళా రిజర్వేషన్ల బిల్లు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, చైనా చొరబాట్ల వంటివి. వీటిపై కేంద్రం చర్చకు తెరదీస్తుందనుకోవడం అత్యాశే.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

