పల్లె పల్లెకు రామసక్కని సెట్లు పెట్టి
ఆకుపచ్చని హారం మెళ్ళో ఏసుకున్నట్లు
సూడ సక్కగా పల్లెలు సింగారించుకొని
చెట్లన్ని మనల్ని ఎదుర్కోల్లకన్నట్లు నిలవడితే
పెయ్యంత పుల్కర్చినట్లవుతున్నది
వానలు వడి పొలాలన్నీ ఏపుగా పెరిగి
ఒడ్ల పొంటి పోతుంటే
సల్లని గాలి తాకి సంబరపెట్టింది
ఊళ్ళో ఉన్న సెరువు ఎండకాలంలో గూడా
నీళ్లతో నిండిపోయి కనవడితే
సెరువుకట్టెక్కి నడుసుకుంటూ పోతుంటే
సెరువులో ఇడిసిన సాపలు
సెంగు సెంగున ఎగురుతుంటే
సూడ సక్కదనమనిపించే..
బిడ్డ పెండ్లి యెట్లసేద్దామో అని అయ్యవ్వలు
గుబులు పడుతుంటే
లచ్చిమొచ్చినట్టు కల్యాణలక్ష్మి వస్త్తుందని
దెలిసి జర్రంత దైర్నం అనిపించింది
ఎవుసం యెట్లసేసుడని దిక్కులు సూత్తుంటే
పెట్టుబడి సాయం కింద
‘రైతుబంధు’తో రంధి వాసింది
ఎనుకవడ్డోళ్లు, ఏమిలేనోళ్లని ‘దళితబంధు’తో
దారిసూపి దరికి చేర్చింది
ముసలోళ్ళకు సాతకాదని
ఇంత ఆసరా కావాలని నెలకింత
పెన్షన్లు ఇయ్యవట్టె
‘కేసీఆర్ కిట్’, వైకుంఠధామాలు,
డంపింగ్‌యార్డులు…
రైతుబీమా వచ్చి తెలంగాణ రంది తీర్చె
తెలంగాణల రైతే రాజయ్యె..!
– నాంపల్లి శ్రీనివాస్ 77940 56287