కన్నతల్లి వేదన

ఎన్ని కలలు కన్నదో
ఎన్ని ఆశల్ని కళ్ళల్లో నింపుకుందో
నవమాసాలు మోసిన కన్న బిడ్డపై..!
కండ్ల ముందు నవ్వుతుంటే
మురిపాల మాటల్ని
అడుగుల్లో వినపడే గజ్జెల సవ్వడిని
సరిగా కొంగుతో మూటకట్టుకోలేదు
తనివి తీరని తరగని ఆప్యాయత సంపద మరి!
నవ్వులు పూసిన లేత కొమ్మ
పండుటాకులా రాలిపడుతుందని..
క్రూర మృగం చేతిలో చిక్కి శల్యమవుతుందని..
కన్నీటిని మిగిలిస్తుందని..
కన్న బిడ్డని మూట కట్టే రోజు
ఒకటి కండ్లముందు వస్తుందని
ఊహకందని రోజొకటి ఊపిరిని లాగేస్తుందని!
అర్ధాంతర ఆయుష్షుతో
చితిపై చేర్చిన ఎగిసే మంటల్లో
నీ నవ్వుల జ్ఞాపకాలు ఎగిసిపడుతున్నాయి..!
కొంగులో బంగారంలా దాచుకొని
కంటి రెప్పల్ని కాపుపెట్టి
ఈ వికృత సమాజంలో
ఏ తల్లి శోకంలో ఇలాంటి నీలి నీడల
ఛాయలు రానియ్యకుండా
గర్భ కుహరంలోనే నడకలు నేర్పించి
నీతి పాఠాలు చెప్పుకోవాలి..!
మృగాల దాడులను
ఎదిరించే విద్యలు నేర్పుకోవాలి..!!
స్వప్న మేకల
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
- Mother
- sadness
- swpna mekala
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

