రాష్ట్రమేదైనా దేశమేదైనా
కాలమేదైనా
ప్రతిభ-విద్వత్తులే పరమ ప్రమాణం
అవగాహన సామర్థ్యమే
అందరికీ ఆమోదయోగ్యం
ఏ విషయాన్నీ శోధించని
ఏ సమస్యనూ తర్కించని
ప్రపంచ కాలమాన
పరిస్థితులను
అధ్యయనంలో అర్థం చేసుకోని
ప్రజాపీఠమైన ప్రజాస్వామ్యాన్ని
గౌరవించని
రాజ్యాధికారమే సర్వజన సంక్షేమ పునాది కానివ్వని
వ్యక్తిత్వ హననాలే నిత్యకృత్యాలై
పతనం పరాకాష్ఠకు చేరుతున్న
వింత విచిత్ర దుర్భర విషమ పరిస్థితుల్లో
సడలని ఆత్మవిశ్వాసం
నీకో వరం
కువిమర్శల సుడిగుండాల్లో
ఊపిర్లు శ్వాసించనీ
కుదిపేస్తున్న సభ్య సమాజ వారసత్వాన్ని
పరిరక్షణలో పరితపిస్తున్న
కాలం కొలిమిలో జ్వలిస్తున్న
ఒక అగ్ని కణం
ఒకానొక వెలుగు రేఖ
మరో చరిత్రకు ఒక
నాందీ ప్రస్థావనం
నవ తరానికి ‘ఆశా కిరణం’.
– లక్ష్మణ్‌గౌడ్ 97049 30509