పిడికిలంత హృదయం ఉన్న మనిషి
దేవుడి ఉనికిని సంకుచితం చేస్తున్నాడు !
గోడలు గోడలున్న తన మెదడుతో
అనేక గ్రంథాలు రాసి రాసి
లోకాన్ని తికమక చేస్తున్నాడు !
ఆహా ! మహా పాండిత్యం !!
అవిశ్వాసికి ఎంత జ్ఞానం ఎక్కువైతే
అంత అజ్ఞానం మరి !
నమ్మకం ఉన్న నిరక్షరాస్యునికైనా
దేవుడి జాడ తన లోపల
లోకమంతా కూడ !
దేవుడు మందిరంలో ఉంటాడు
మసీద్‌లో ఉంటాడు
మన పిలుపునకు పలకడానికి పక్కనే ఉంటాడు
మందిర్ మసీద్ తేరే దామ్ !
ఈశ్వర్ అల్లా తేరే నామ్ !
కందాళై రాఘవాచార్య: 87905 93638