సైకిల్ యాత్రకు సాదర స్వాగతం!
తెలంగాణ నీటి కష్టాలు తీరాలంటే మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ కొందరు తెలంగాణ యువకులు దాదాపు 350 కిలోమీటర్ల దూరం నుంచి సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్లి కేసీఆర్‌ను కలిసిండ్రు. వారి అభిమానానికి మురిసిపోయిన కేసీఆర్ ఇంట్లోకి ఆహ్వానించి, ఆప్యాయంగా పలకరించి అభినందించారు.
తెలంగాణ నీటి కష్టాలు తీరాలంటే మళ్లీ కేసీఆరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటూ కొందరు తెలంగాణ యువకులు దాదాపు 350 కిలోమీటర్ల దూరం నుంచి సైకిళ్లు తొక్కుకుంటూ వెళ్లి కేసీఆర్‌ను కలిసిండ్రు. వారి అభిమానానికి మురిసిపోయిన కేసీఆర్ ఇంట్లోకి ఆహ్వానించి, ఆప్యాయంగా పలకరించి అభినందించారు. మరోవైపు.. ఏపీలోని ఆదోని నుంచి తొమ్మిది రోజులపాటు నడుచుకుంటూ వచ్చానంటూ ఓ యువకుడు సీఎం రేవంత్‌రెడ్డిని కలిశాడు. అభిమాని వెంట తెచ్చుకున్న శాలువాను ఆ అభిమానికి వరండాలోనే కప్పిన రేవంత్‌రెడ్డి పంపించేశారు. దీన్నే రేవంత్ అభిమానులు గొప్ప పనిగా చంకలు గుద్దుకుంటున్నరు! కానీ తెలంగాణవాదులకు మాత్రం ఇందులో మరో ముచ్చట కనిపిస్తున్నది. తెలంగాణ యువకులు తెలంగాణకు నీళ్లివ్వాలని, కేసీఆరే మళ్లీ గద్దెనెక్కాలని కోరుకుంటుంటే.. ఆంధ్ర యువకులు మాత్రం రేవంత్‌రెడ్డి పట్ల అభిమానం చాటుకుంటున్నారు. తెలంగాణ నుంచి వేయి టీఎంసీల నీళ్లను ఏపీ వైపు పంపినందుకా ఈ పాదయాత్రలు, కృతజ్ఞతా సత్కారాలు? అందుకే అంటరు.. ఇంట గెలిచి రచ్చ గెలవాలె అని. కానీ సొంత రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టి ఆదాయం సంపాదించుకుంటే.. చరిత్రలో స్థానం ఏముంటుంది?
ఎప్పుడో తెల్వదు.. తొందరెక్కువ!
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది ఇందిరమ్మ బీమా పథకం తీరు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఇటీవలి మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా.. సుదీర్ఘంగా.. మరీ సుదీర్ఘంగా చర్చించి తీసుకున్న నిర్ణయమేంది అంటే.. దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం! ఇంతకూ బీమా అమలు ఎప్పటి నుంచి? అంటే సమాధానం గప్‌చుప్! విధివిధానాలు లేవు.. అమలు తేదీ లేదు.. లబ్ధిదారులకు ఎప్పటి నుంచి భరోసా దక్కుతుందో స్పష్టత లేదు. కానీ హడావుడికి మాత్రం హద్దే లేదు. పథకం పట్టాలెక్కకముందే సిద్దిపేటలో ప్రారంభోత్సవ సభకు సిద్ధమైపోయిండ్రు. చేతిలో చెత్తిరి లేకుండానే వానలో ఊరేగింపునకు బయలుదేరినట్టుంది వ్యవహారం. ఇక మంత్రివర్గ భేటీలో గంటల కొద్దీ చర్చించాల్సిన ఎల్ నినో ముచ్చటకు మాత్రం టైమ్ దొరికినట్టు లేదు. ఒకవైపు ఎనిమిది నెలలు ఎల్ నినో ఇక్కట్లు తప్పవు అని హెచ్చరిస్తూ నీళ్లను, కరెంటును పొదుపుగా వాడుకోవాలని ప్రజలను పాలకులు భయపెడుతున్నరు. కానీ ఎజెండాలో ఆ ప్రస్తావనే లేకపోవడం కొసమెరుపు. పథకం ప్రకటిస్తే సరిపోదు.. ప్రజలకు ఫలితం అందాలె! ఇల్లు అలుకగానే పండుగ కాదు.. ఇంట్లో పొయ్యి వెలిగితేనే పండుగ అని గుర్తుంచుకోవాలి. దరఖాస్తులు తీసుకోవడమే పథకం కాదు.. పేదలకు భరోసా ఇవ్వడమే పథకం అవుతుంది.
కరువు తీసుకొచ్చినంక నిద్రలేచిండ్రా?
ఎనభై వేల కోట్ల ఖర్చుతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని, ప్రాజెక్టు మొత్తం మునిగిపోయిందని గగ్గోలు పెట్టినోళ్లే ఇప్పుడు నాలుగు వేల కోట్లతో పునరుద్ధరణకు ఆదేశాలిచ్చిండ్రు. వినడానికి ఇచ్ఛంతంగా లేదా? నోటికొచ్చిన ఆరోపణలు చేశారని అనుకున్నా అసలు నిజం ఏది? లక్ష కోట్ల అవినీతితో కూలిన ప్రాజెక్టా? నాలుగు వేల కోట్లతో బాగుపడే ప్రాజెక్టా? ‘పిల్లి నల్లదైతే ఏంది.. తెల్లదైతే ఏంది’ అన్నట్టు కాకుండా, ప్రజలకు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చినోళ్లు ప్రజలకు ఇప్పుడైనా నిజాలు చెప్పాలె కదా!
మూడేండ్ల కిందటే పునరుద్ధరణపై దృష్టి పెట్టుంటే ఇంతకంటే తక్కువ ఖర్చుతో పనైపోయేది కదా? అప్పుడే మరమ్మతులు చేపట్టి ఉంటే ఇప్పుడు రాష్ట్రంలో ఈ ఎల్ నినో కష్టాలు ఉండేవా? ప్రజలకు తాగునీరు, సాగునీటి కష్టాలు, కరెంట్ కొరతలు ఉండకపోయేది. స్వార్థ రాజకీయ కక్షల కోసం ప్రాజెక్టును బద్నాం చేయడం సులువే. కానీ రాష్ట్ర అవసరాలను తీర్చడం అంత సులభం కాదు. ఇప్పటికైనా బుద్ధిజీవులు ప్రచారాలను కాకుండా వాస్తవాలను పరిశీలించాలె. ఎందుకంటే ‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు’ ప్రజలకు కావాల్సింది ఆరోపణలు కాదు.. తమ భవిష్యత్తుకు బాటవేసే వాస్తవాలు!
ప్రజల పైసలతో పుట్టినరోజు పందిళ్లా?!
అప్పుల రాష్ట్రంలో ఆర్భాటాల జాతర నడుస్తున్నది. కొడంగల్‌లో కొలువైన కుటుంబ పాలన జోరు అందుకున్నది. ఒకపక్క రాష్ట్రం అప్పుల ఊబిలో ఉన్నదని చెప్తరు.. ఇంకోపక్క ముఖ్యమంత్రి పుట్టినరోజు పేరిట ప్రజాధనంతో పండుగ చేసుకుంటరా? ఇదేం విడ్డూరం.. అప్పు చేసి పప్పుకూడు తిన్నా పర్వాలేదన్నట్టుగా కొడంగల్‌లో మూడు రోజుల సంబురాలకు తెరలేపుతున్నారట. ఈ నెల 7, 8, 9 తేదీల్లో మంత్రులు, అధికారులు కొడంగల్‌లోనే కొలువుదీరాలట. సభలకు జనాలను తరలించేందుకు ఆర్టీసీ బస్సులు సిద్ధమైనయట. ఈ మూడు రోజులు హోర్డింగులు, ఫ్లెక్సీలు, పత్రికలు, టీవీల్లో ప్రచారాల హడావుడి హోరెత్తుతున్నదట. ఈ వేడుకల ఖర్చు రూ.150 కోట్లంటూ ప్రచారం జరుగుతున్నది. నిజంగానే అంత ఖర్చయితే ఆ భారం ఎవరి మీద పడుతున్నట్టు? రాష్ట్రవ్యాప్త ప్రాధాన్యతల మాటేమిటి? కానీ సీఎం అంటే ఒక్క నియోజకవర్గానికే కాదు కదా! రాష్ట్రం మొత్తం ఆయన బాధ్యత. కొడంగల్ అభివృద్ధి కావాలె.. మిగతా తెలంగాణకు మాత్రం మొండిచేయి చూపడం ఎంతవరకు సమంజసం. వృథా అవుతున్న ప్రజాధనం గురించి మేధావులు, విశ్లేషకులు కూడా గొంతెత్తి ప్రశ్నించాలె. పదవులు, బిస్కిట్లు, స్వీట్లకు ఆశపడపడితే ప్రజలే తగిన బుద్ధి చెప్తరు. ప్రజాధనం అంటే ఎవరి అయ్య సొత్తో కాదు.. ప్రజలందరి కష్టం.
-దాము నర్మాల
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మామిడి పండ్లు తిన్న వెంటనే ఇవి తీసుకుంటున్నారా.. అయితే ఆరోగ్యాన్ని రిస్క్‌లో పెడుతున్నట్టే..!
Sonia Gandhi | నాటి ఎమర్జెన్సీ నిర్ణయం పొరపాటే.. ఇంటర్వ్యూలో సోనియాగాంధీ కీలక వ్యాఖ్యలు
Skin Color | చర్మం నలుపు రంగులో ఉంటే అనారోగ్యంగా ఉన్నట్లా.. అపోహల గురించి నిపుణులు ఏం చెబుతున్నారు..?
AP News | బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో బొత్స కుమార్తె ఓటమి
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

