తక్షకులు ప్రవేశించారు
కక్షలకు మేత వేస్తున్నారు
వివక్షలకు తెర తీస్తున్నారు
అక్షయపాత్రనే దొంగిలిస్తారు
ఆశలు, ఆశయాలు, కూలిపోనున్నవి
నీళ్లు, నిధులు, నియామకాలు గుంజీలు తీస్తున్నవి
అజ్ఞానులకే సింహాసనం అలంకారమైనది
సకలజనుల సాధన వేదనకు గురైనది
వ్యవసాయ ప్రాజెక్టులకు మంగళం పాడుతున్నారు
కోశాగారానికి నిత్య మంగళమంటున్నారు
అబద్ధాలకు పంచరంగులద్దుతున్నారు
పాలితుల తలపై శఠగోపం అలంకరిస్తున్నారు
ప్రక్కవాడు చెక్కిలిగిలి చేస్తున్నాడు
చిరకాల మిత్రుడు మైకంలో చేరుకున్నాడు
తోటి భజనపరులు నీళ్లు నములుతున్నారు
అధికారులు నూతులు బేతాలిస్తున్నారు
ఓ పౌరుషాల తెలంగాణమా
తేరుకొని కళ్ళు తెరువుమా
పుట్టి మునుగకుండా మేల్కొనుమా
మట్టుపెట్టాలి అరులను మిత్రమా…