వెలుగు కిరీటం
సింగిడీలు పూసుకున్న రంగురంగుల లోకం హంగులెన్నో దిద్దుకున్న అద్భుతమైనదీ లోకం వెలుగుంటే దర్శనం..
సింగిడీలు పూసుకున్న రంగురంగుల లోకం
హంగులెన్నో దిద్దుకున్న అద్భుతమైనదీ లోకం
వెలుగుంటే దర్శనం..
అద్భుతాన్ని గాంచితేనే ఆనందం.. మహానందం..
కదిలే నాగలి సాగు గీతలు
అందమైన లోకానికి హరిత చూపులు
ముసలవ్వ, తాతలకు
ముద్దుల మనుమరాండ్లను చూసి
మురిసిపోయే ఆప్యాయత చూపులు
కంప్యూటర్లకు హత్తుకున్న జీవితాలకు అత్యుత్తమ చూపులు
దేశాన్ని కాపాడే కండ్లను కాపాడే చూపులు
అన్యాయాన్ని ధిక్కరించే వారికి అభ్యుదయపు చూపులు
నెత్తికి చెయ్యి అడ్డం పెట్టుకునే
నేల చూపులు కాదు కావాల్సింది
శిఖరంలా నింగిని చూసే చూపు కావాలి
మంద చూపు కాదు, ముందుచూపు కావాలి
ఇంటిముందు సంక్రాంతి ముగ్గుల్లా
కంటి ముందుకే వైద్య దీపాలు..
కండ్లకు అద్దాలు, కాళ్లకు ఉద్దాలు
అన్నివర్గాల జీవితాలకు వెలుగు కిరీటాలు
మసక బారిన బతుకులకు మనోధైర్యం
కంటి వెలుగు
చిక్కొండ్ర రవి: 9502378992
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

