బాహ్యశుద్ధి వలయు బ్రతుకునందెప్పుడు
అంతరంగ శుద్ధి ఎంతో మేలు
వాక్కు శుద్ధి లేదు ప్రాణి హింస పెరిగి
వింత ‘కరొన’ ప్రబలె విశ్వమంత!
ముక్కు మూతి మూయు మొదటి రక్షణ మాస్కు
జాగరూకుడవయి సంచరించు
మంచి తిండి నిద్రమించి ఏదియు లేదు
ప్రాణశక్తి కలిగి పరగ వలెను!
భయము వలన ప్రాణవాయువు తగ్గును
భయము వీడి మనము బ్రతుక వలయు
సంశయాత్మకుండు సాధించలేడేది
భయము పెద్ద జబ్బు బ్రతుకునందు!
స్వీయ రక్షణ తోడ చింతలు లేకుండ
మంచి మార్గమందు మనుట శుభము
‘కొవిడు’ సోకినంత కోల్పోకు ధైర్యము
అభయమెట్లు కలుగు ఆత్మయందు!
త్రుళ్ళిపడుట తగదు తమ్మినా దగ్గినా
సహజ వేగములవి సత్వమందు
ప్రజలు భయము చేత పరుగులు పెట్టుట
గుంపులై కలియుట సొంపు గాదు!
జక్కని వేంకటరాజం
94400 21734