కూలగొట్టాల్సిందే..
బాహ్యంగానే కాదు, అంతర్యంలోనూ
కులమత వర్గ జాతులతో
ముక్కలవుతున్న మనిషిని
పునర్నిర్మించుకుంటూ
ఒక్క మాటై నిలువటానికి
కూలగొట్టాల్సిందే..!
స్వార్థాన్నో స్వప్రయోజనాన్నో
అహాన్నో అభిజాత్యాన్నో వేటినైతేనేం
పాతుకుపోయిన పాతవాసనలన్నిటినీ
నిస్సంకోచంగా ధ్వంసం చేయాల్సిందే!
ఔను.. కూలగొట్టాల్సిందే..
ఒక నిర్మాణంగా నిలిచి
నిర్వచనంగా మిగులకపోతే
గతం వర్తమానానికి పాఠమై
రేపటికో చూపునివ్వకపోతే
కాళ్లులేని మరో కథ కంచికి చేరుతుంది
తన కండ్లు తానే పొడుచుకుంటూ
మళ్లీ కాలం కబోదిలా మిగిలిపోతుంది..!
ఏడు దశాబ్దాల దుర్భర దారిద్య్ర చరితం
కేసీఆర్ అభ్యుదయ ఆశయంతో
అభాగ్యుల దుస్థితికి చరమగీతం
అన్నార్తుల ఆకలిరోదనలకు సమాధానం
ఆత్మాభిమానం నింపిన ‘దళితబంధు’!
కేసీఆర్ మహానుభావుడు
కులవివక్ష అనే విషవృక్షాన్ని
మూలాలతో సహా పెకిళించే కారణజన్ముడు..!!
-వంటిపులి నాగరాజు