‘న’ను గన్న నా తల్లి తెలంగాణ
‘మ’ము చల్లగా చూసిన కల్పవల్లికి నమ
‘స్తే’ నమస్తే నమస్తే నమస్తే
‘ప’సి తెలంగాణ పసిడి పంటలతో
‘ది’న దినం వటుడింతై అంతైనట్లు
‘వ’సుధలో వాసికెక్కి జనులు సిరి
‘సం’పదలతో సుఖముగా ఉండిరి
‘తా’ము కన్న కలలు నెరవేరి
‘ల’క్షణమైన విలక్షణ పరిపాలనలో
‘సం’చలనమైన సంస్కరణలతో సాగ
‘బు’ధులు మెచ్చి ఇచ్చిరి బహుమతులెన్నో
‘రా’రండి రండి దర్శించండి
‘ల’లిత సద్గుణ సుగుణ సుపరిపాలన
‘తె’లుగు వెలుగైన బంగారు తె
‘లం’గాణ బిడ్డలం అదృష్టవంతులం
‘గా’న అభివృద్ధిపథంలో అందరికీ ఆదర్శం
‘న’వ్య దివ్య తెలంగాణ భారతదేశాన
(పది వసంతాల తెలంగాణసంబురాల సందర్భంగా..)
పి.బక్కారెడ్డి: 97053 15250