అన్నా! కులాసేనా?..
నువ్వు కులాసేనా తమ్మీ…అది జెప్పు ముందు..
ఈ పోస్టులో ఉన్నోన్ని కులాసగా ఉండనిస్తారే… నీకు తెల్వదా ఏంది?
ఏమైందే… అంత రంది పడుతున్నవు..
మీ పార్టీలో ఎట్ల ఉందో.. గికడ మా పార్టీల గూడ గట్లే ఉందే..
జర డిటైల్గా చెప్పరాదే?
పార్టీకి నేను బాస్.. చేస్తే గీస్తే పాదయాత్ర నేను చెయ్యాలె, కానీ.. ఆయనెవ్వరు (భట్టి) చేయడానికి? పైగా దానికి పీపుల్స్ మార్చ్ అని పేరు పెట్టి.. ఆయనంతకాయన రాజశేఖర్రెడ్డి లెవల్లో ఫీల్ అయితుండు..
అవునే! నేను కూడా టీవీల జూసిన. రాష్ట్రమంత తిరుగుతడట కదా?
తిరుగని.. ఎట్ల తిరుగుతడో అదీ చూస్తా.. నాది పోని కానీ మీ దాంట్లో లొల్లి ఏందో చెప్పే?
మేము ఎన్నేండ్ల నుంచో పార్టీలో ఉన్నం.. పార్టీతో లంగూట్ దోస్తాని నాది. కానీ ఆయన (ఈటల) నిన్నమొన్న వచ్చిండు.. అప్పుడే రాష్ట్ర నాయకుడిలా ఫీల్ అయితుండు. తనకు తానే పెద్ద తురుమ్ఖాన్ అనుకుంటుండు..
ఇంతకు ఏమైందే?..
చూసినవు కదా సిటీ అంతా ఆయన బర్త్డే అని ఫ్లెక్సీలు కట్టిండు. నువ్వే చెప్పు సిటీకి ఆయనకు ఏం సంబంధం? పెడితే గిడితే హుజారాబాద్లో పెట్టుకోవాలి కానీ. సరే.. సరే.. ఎవరో వస్తున్నరు మళ్లీ మాట్లాడుతా..
(రేవంత్ ఫోన్ కట్ చేసిన బండి)
-వెల్జాల