శాతవాహనుల కాలపు
శౌర్య పరాక్రమ భూమి
కాకతీయ రాజుల
కళల కాణాచి ఈ నేల
విష్ణుకుండిన పలికిన
విశ్వగీతి ఈ పుడమి
పువ్వులను పూజించే
పచ్చని సంస్కృతి
అలాయి బలాయి అనే
అందమైన సంస్కృతి
బతుకు చిత్రం మార్చే
బంధు సంస్కృతి
కమ్మని పాటల ఊట
జానపదుల పూదోట
భాగవతపు పోతన్నది
భక్తి నేర్పిన జాడ
బతుకమ్మలను కొలిచేటి
బంగారు కాంతుల జనా
పీర్ల పండుగతో
చేరదీసే సంస్కృతి
సమ్మక్క సారలమ్మ
సమైక్య సంస్కృతి
వీరులను కీర్తించే
దీరా సంస్కృతి
ద్విపదను అందించిన
ఆదికవి పాల్కుర్కి
అచ్చ తెలుగు పలుకుల
అందమైన ఈ నేల
33 జిల్లాల
ముచ్చటైన తెలంగాణ
విభిన్న మతాల
వేద భూమి ఈ నేల
కోటి కాంతుల జానా
నా తెలంగాణ
కోటి రతనాల వీణ.
-దేవులపల్లి రమేశ్, 99637 01294