రేవంత్‌రెడ్డి వెళ్లి రామోజీని కలుస్తాడు. కేవీపీ వచ్చి రేవంత్‌ను కలుస్తాడు. చంద్రబాబు వెళ్లి మోదీని కలుస్తాడు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వెళ్లి చంద్రబాబును కలుస్తాడు. అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్‌ను కలుస్తాడు. షర్మిల ఢిల్లీ వెళ్లి కాళేశ్వరంపై ఫిర్యాదు చేస్తారు. పవన్ కళ్యాణ్ తెలంగాణలో యాత్ర మొదలు పెడుతానంటాడు. కేఏ పాల్ వచ్చి మునుగోడులో పోటీ చేస్తాడు. అసలు ఎవరు వీరంతా? వీళ్లకు తెలంగాణకు ఏమి సంబంధం? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును అడ్డుకునేందుకు అప్పుడు కూడా తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ అచ్చంగా ఇదే మాదిరిగా ఏకమై అడ్డం తగిలినప్పటి దృశ్యం కళ్ల ముందు పునరావృతం కావడం లేదా? ఈ హడావుడి చూస్తే ‘ఉత్తోడొచ్చి ఊరికి తోరణం కట్టిండు’ అనే సామెత గుర్తుకు రావడం లేదూ!