పేరు గొప్ప ఊరు దిబ్బ
‘గుజరాత్ మోడల్' అంటూ గొప్పలు పోయేవారు అదెంత ‘అద్భుత’మో తేటతెల్లం చేశారు. డబు ల్ ఇంజిన్ ప్రగతి ఏ మోస్తరులో ఉంటుందో దేశం ముందు చిత్రిక కట్టి ప్రదర్శించారు. ‘వ్యవసాయానికి కరెంటు అవసరాన్ని గుర్తించి 8 గంటల నిరంతరాయ విద్యుత్ అందించాలని నిర్ణయించినందుకు రైతు సం ఘాల తరపున సీఎం భూపేంద్ర పటేల్, ఆర్థికమంత్రి కానుదేశాయ్లకు కృతజ్ఞతలు..’ అని ట్వీట్ చేస్తూ గుజరాత్ వ్యవసాయశాఖ మంత్రి రాఘవ్జీ పటేల్ మురిసిపోయారు.
‘గుజరాత్ మోడల్’ అంటూ గొప్పలు పోయేవారు అదెంత ‘అద్భుత’మో తేటతెల్లం చేశారు. డబు ల్ ఇంజిన్ ప్రగతి ఏ మోస్తరులో ఉంటుందో దేశం ముందు చిత్రిక కట్టి ప్రదర్శించారు. ‘వ్యవసాయానికి కరెంటు అవసరాన్ని గుర్తించి 8 గంటల నిరంతరాయ విద్యుత్ అందించాలని నిర్ణయించినందుకు రైతు సం ఘాల తరపున సీఎం భూపేంద్ర పటేల్, ఆర్థికమంత్రి కానుదేశాయ్లకు కృతజ్ఞతలు..’ అని ట్వీట్ చేస్తూ గుజరాత్ వ్యవసాయశాఖ మంత్రి రాఘవ్జీ పటేల్ మురిసిపోయారు. ఇదీ గుజరాత్ మోడల్! 62 ఏండ్లలో గుజరాత్ సాధించిన ఘనత. మోదీ సొంత రాష్ట్రంలో అభివృద్ధి ఏమిటంటే.. వ్యవసాయానికి కేవ లం 8 గంటల కరెంటు మాత్రమే ఇవ్వగలగటం. దేశంలోనే అతిపిన్న రాష్ట్రం తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగానికి జీవనాడియైన విద్యుత్తును 24 గంటలు ఉచితంగా అందిస్తున్నది. రైతుకు అండగా రైతుబంధు, రైతుబీమా అందిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మాత్రం చేసిందేమిటని ఎద్దేవా చేస్తారు!
అభివృద్ధికి పరోక్ష ‘షరతు’ (హెచ్చరిక)గా బీజేపీ ముందుకు తీసుకొచ్చిన పదం ‘డబుల్ ఇంజిన్ గ్రోత్’. అంటే.. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ అధికారంలో ఉంటే జంట ఇంజిన్లతో ఆ రాష్ట్రం విశేష ప్రగ తి సాధిస్తుందని చెప్పడం. కేం ద్రంలో తామే అధికారంలో ఉన్నాం కాబట్టి, రాష్ర్టాల్లో కూడా బీజేపీనే గెలిపించాలని, లేకుంటే అంతే సంగతులనే బెదిరింపు. తమకు అధికారం అప్పజెప్పటమో, లేదా తమ చెప్పుచేతల్లో ఉంటే నో తప్ప తాము దేంట్లోనూ అండగా నిలువబోమని ఓటర్లను హెచ్చరించటం. ఇలాంటి జంట ఇంజిన్ల నినాదంతోనే మొన్న జరిగిన ఐదు రాష్ర్టా ల ఎన్నికల్లో లబ్ధి పొందారు. డబుల్ ఇంజిన్ నడకకు నోచుకున్న యూపీ, సింగిల్ ఇంజిన్‌తో తెలంగాణ సాధించిన ప్రగతిలో దేంట్లోనూ సాటిరాదు. యూపీలో తలసరి ఆదాయం రూ.71 వేలు అయితే, తెలంగాణలో అది 2.78 లక్షలు. యూపీ వృద్ధిరేటు 25.6 శాతమైతే, ఏడేండ్లలో తెలంగాణ 55.46 శాతం. బాలింత మరణాల రేటు యూపీ లో 167 అయితే, తెలంగాణలో కేవలం 56. ఇలా ఎన్నైనా, ఏ రంగాన్నైనా చెప్పుకోవచ్చు.
మోదీ తన పద్నాలుగేండ్ల పాలనా కాలంలో ఏం సాధించి, దేన్ని గుజరాత్ మోడల్ అంటున్నారు? 2011 జనాభా లెక్కల ప్రకారం పేదరికపు రేటులో రాజస్థాన్, ఉత్తరాఖండ్, నిరంతరం కల్లోల జమ్మూకశ్మీర్ కన్నా గుజరాత్ అధ్వాన్నం. మానవ వనరుల అభివృద్ధిలో గుజరాత్ దయనీయంగా ఉన్నదని ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్’లో ఆర్బీఐ తేల్చింది. మాజీ కేంద్రమంత్రి యోగీందర్ కె.అలఘా ప్రకారం.. గుజరాత్‌లోని మొత్తం 17,848 గ్రామాల్లో దాదాపు సగం పల్లెలు ఇంకా తాగునీరుకు నోచుకోలేదు. డబుల్ ఇంజిన్ వాదన ఎంత డొల్లనో దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు. మాటలు కాదు, చేతలు కావాలి.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
Venu Udugula | రాప్తాడు ఘటనపై దర్శకుడు వేణు ఊడుగుల ఆవేదన.. ‘అమ్మాయి కాదంటే వెంటపడటమే హీరోయిజమా?’
Janhvi Kapoor | శ్రీదేవి ఐకానిక్ ‘నాగిని’ లుక్‌ను రీక్రియేట్ చేసిన జాన్వీ కపూర్.. హలోవీన్ పార్టీలో స్పెషల్ అట్రాక్షన్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

