ఆఖరి మజిలీ

నిన్నటిదాకా అన్ని గూళ్లల్లో కిచకిచ
ఏ చోట నుంచి వచ్చాయో రెక్కలున్న పక్షులు
రెక్కలు తొడిగిన పక్షులు అన్నీ ఆ చెట్టు కొమ్మలోనే
ఇక్కడే ఈ మహావృక్షంలో ఏదో ఒక మూల
ఇప్పుడు ఏదో వింత దృశ్యం కరాళ నృత్యం
నిండైన వనంలో ఏదో రక్కసి
ఊడల ఉయ్యాల్లో కోరలు విప్పింది
గొడుగు కింద చువ్వలా కుచ్చేసింది
ఇప్పుడు మనిషి మనిషికీ మధ్య గోడలే ఏం గుణపాఠమో తెలియదు కానీ పక్షుల వలసకు అలవాటు పడ్డ మనిషి
తనకుతానే అనుకున్న మనిషి
డబ్బు అహం అధికారాలే అనుబంధాల కన్న మిన్న అన్నోడు
యద్భావం తత్భవతు అనుకున్న వైరస్ కరాళ నృత్యంలో
తలపులన్నీ మూతలు తలపుల తలుపులు కూడా
అక్కడ ఏదో పక్షి, పలకరించే ఆత్మీయతను
కరువు చేసుకున్న తాను చేజేతులా
వైరస్ విశృంఖలతలో తోడునీడల్ని
కన్న ప్రేమల్ని స్నేహబంధాన్ని
అన్నింటినీ విడిచి ఒంటరి పోరులో
అలా నిష్క్రమించడం
కడచూపు కూడా నోచని జీవన చివరి ప్రయాణం
గుండెల్లో రేగిన ఎన్ని అలజడులో
మనసును పిండివేసిన ఎన్నెన్ని జ్ఞాపకాల దుఃఖాలో
ఆ చివరి క్షణం తన వారి మధ్యలేని వ్యధ
ఓ చేదు నిజం ఎన్నో ప్రాణాల్ని కలిచేస్తున్న
ఆఖరి మజిలీ…
- డాక్టర్ బండారు సుజాత శేఖర్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MS Dhoni | జెన్-జీకి ఎమ్మెస్ ధోని సూచన.. అలాంటి అలవాట్లతో ఆరోగ్యం పాడవుతుందంటూ ఆందోళన
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

