నిరంతర స్ఫూర్తి
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. ఆమె గురించి తెలంగాణ ప్రభుత్వం అయిదో తరగతి తెలుగు వాచకంలో పాఠం పొందుపరచడం హర్షణీయం. ఏటా ప్రభుత్వం నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతుల ద్వారా ఆమె చరిత్ర ప్రతి గడపకూ చేరింది.
తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చిన పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. ఆమె గురించి తెలంగాణ ప్రభుత్వం అయిదో తరగతి తెలుగు వాచకంలో పాఠం పొందుపరచడం హర్షణీయం. ఏటా ప్రభుత్వం నిర్వహిస్తున్న చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతుల ద్వారా ఆమె చరిత్ర ప్రతి గడపకూ చేరింది. మనమంతా ఆమె బాటలో నడవడమే ఆమెకు సరైన నివాళి.
తెలంగాణ అమర వీరులకు జోహార్లు తెలుపుతూ తెలంగాణ ప్రభుత్వం చిట్యాల ఐలమ్మ (చాకలి ఐలమ్మ) పాఠ్యాంశాన్ని ఐదో తరగతి తెలుగు వాచకంలో పొందుపరిచింది. ఈ పాఠం రాబోయే తరాలకు స్ఫూర్తిని ఇస్తుంది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి, వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆనందదాయకం. తమ హక్కుల కోసం కొట్లాడే వారికి ఐలమ్మ స్ఫూర్తిదాయకం. తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయి. సబ్బండ వర్గాల బహుజన బిడ్డగా, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన ఐలమ్మ మలి దశ తెలంగాణ ఉద్యమానికి ప్రేరణ అయ్యారు. అలాంటి యోధురాలి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆత్మీయత చూపించడం హర్షణీయం. బహుజన ఆత్మ గౌరవానికి ఐలమ్మ ప్రతీక అని సీఎం కొనియాడారు. ఐలమ్మ తెగువ, పౌరుషం ప్రదర్శించారని.. అవి తెలంగాణ అస్తిత్వాన్ని, గౌరవాన్ని చాటి చెప్పాయని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది పోరాడారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు ఏనాడూ ఆమె సేవలను గుర్తించలేదు. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పోరాటాన్ని గుర్తించి ఆమె చరిత్రను ప్రతి గడపకూ చేర్చింది. ఏటా అధికారికంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై 50 అడుగుల చాకలి ఐలమ్మ విగ్రహం పెట్టాలని చాకలి ఐలమ్మ సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. స్త్రీ నిధి భవనాలకు ఆమె పేరు పెట్టాలని, ఐదు ఎకరాల్లో చాకలి ఐలమ్మ స్మారక భవనాన్ని నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలని, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ఆమె చిత్రపటాన్ని ఉంచాలని కోరుతున్నాం. మనమంతా ఐలమ్మ స్ఫూర్తిని కొనసాగిద్దాం… ఆమె బాటలో సాగుదాం.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

