ఉ: త్యాగము జీవమై బహుళ ధర్మము తోడుగ సమ్మె చేసియున్,
భోగములన్నియున్ వదిలి పోరును సల్పగ రాష్ట్ర సిద్ధికిన్,
రాగము రమ్యమౌ మనసు రంజిలచేసియు రాజ్య పొందుకై,
యాగముగాను భావనల యానము చేసెను కేసిఆరిలన్..
ఉ: మక్కువతోడు నీడగను మానక నూతన రాష్ట్రభూమికై
చక్కగ పెంపుమీరగను చల్లని మాన్యులు ‘కేసిఆరిలన్’,
చక్కని మార్గదర్శిగను సాగెను ముందుకునవ్య తేజుడై,
అక్కున జేర్చెనీప్రజల నాతని ప్రాణమువోలె నిత్యమున్..!
ఉ: ఎక్కడి కృష్ణవేణి మరియెక్కడి చల్లని నీటిధారలున్,
చక్కగ తెల్గుబిడ్డలకు చల్లగనిచ్చెను ఇంటినింటికై,
మక్కువ మీరగా ప్రజకు మంచితనంబున సర్వకార్యముల్,
నిక్కము నింపగా చెరువు నీతినితప్పగ కర్షకాలికిన్..!
ఉ: ధారుణి లోపలన్ వెలుగెదారియు తప్పక నూత్న రాష్ట్రమున్,
భారములన్నియున్ తనదు బాద్యులకూడిక తోడు రాగ, సా
కారముమయ్యె కాదబహుకార్యములన్నియు తీర్చగాభువిన్!
కోరిన కోర్కెలన్నియును కోరకనిచ్చెను మానవాళికిన్..!
ఉ: దేశమునందు మిన్న కడుతెంపును చూపెను ‘కేసిఆరి’లన్,
క్లేశములందునన్ యెదురుకేలును మేలును చేయబూన, ఆ
వేశము తోడుగా యువత వేగిర బాధల ప్రాణచాగముల్,
లేశము కాకయున్ సతము లేచిరి పెద్దలు పిన్నబాలురున్..!
ఉ: అందరు కూడియున్ బహుళ అద్భుత రీతిన సాగి ముందుకున్,
సుందర నవ్య రాష్ట్రమును చూడగ చేసిరి కోర్కెమీరగన్,
మందిరమాయెనే సతము మాన్యత లొప్పగ సర్వ సిద్ధులున్,
బంధుర భాసురంబు బహు బంగరుమట్టిగ వెల్గె రాష్ట్రమున్..!
ఉ: సర్వము మానవాళికిని సాధనమీరగ కోర్కెలన్నియున్,
పర్వపు రీతులన్ సతము పారవశంబును కల్గచేసియున్,
మర్వము మానవీయతలు మంజుల సౌరభ నిత్యకృత్యముల్,
గర్వముజాడ లేకయునుకాంచగ సల్పెను సేవభావముల్..!!
– డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచారి, 85558 99493