వజ్రభారతికి వందనం
ఉ. భారతధారుణీమహితభాగ్యమహోదయవజ్రపర్వన వ్యారుణకాంతిజాలపరిభాసితదివ్యముహూర్తవేళలో పౌరవరేణ్య!ఎత్తుము త్రివర్ణపతాకము;వ్యోమసీమబృం దారకమందిరాగ్రనిరతస్థితకేతనమై రహించగా
ఉ. భారతధారుణీమహితభాగ్యమహోదయవజ్రపర్వన
వ్యారుణకాంతిజాలపరిభాసితదివ్యముహూర్తవేళలో
పౌరవరేణ్య!ఎత్తుము త్రివర్ణపతాకము;వ్యోమసీమబృం
దారకమందిరాగ్రనిరతస్థితకేతనమై రహించగా
చం.కులమతజాతిభేదభవకుడ్యములన్ పడద్రోచి; స్వార్థసం
కులకలహోన్ముఖాంతకుల కోరలుపీకి;ప్రతీపదుష్టశ
క్తులదునుమాడి;గాంధీమహితోన్నతబోధసదాశయమ్ముగా
కలిసిపదండిముందుకు వికాసపథమ్ముల దేశసేవకై
ఉ.వందలఏండ్లు ముష్కరదివాంధనిరంకుశపాలనమ్ములో
కుందినజాతిముక్తికయి ఘోరరణమ్మును చేసినారహో
ఎందరో దేశభక్తులు;తదీయమహాశయదివ్యరూపమీ
సుందరభారతాఖిలవసుంధర;పాడుము జాతిగీతముల్
– డా.అయాచితం శ్రీధర్
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

