ఆకాశంలో.. నక్షత్రం మా ఊరు
ఆకాశంలో.. చందమామ మన బడి
జ్ఞానమే కదా దేశం జ్ఞానమే కదా ఊపిరి
నెత్తిన ఎండను కప్పుకొని రెక్కలు ముక్కలై
పొద్దెల్లదీస్తున్న శ్రామికులు
కార్పొరేట్ చదువులను కొనుక్కోలేని
అందుకోలేని అభాగ్యులు
సాహసోపేత నిర్ణయంతో
హద్దులు చెరిగిపోనున్నయి
అసమానతలు ఒరిగిపోనున్నయి
ఆలోచనల అమృతం మన ఊరు మన బడి
సమానతకు తొలి అడుగు
గతితప్పిన అడుగులు
మొగురాలలా నిలబడుతున్నయి
పాతాళంలోని నీరు పైకి తోడినట్లుగా
ప్రతి సర్కారు పాఠశాల అమ్మలా
ఆంగ్ల సమురును మాడంటాలి
కూలిపోయిన కలలు జలపుష్పాల్లా ఎదురెక్కాలి
ప్రభుత్వ బడులే దేశ భవిష్యత్తుకు పునాదులు
మన బడికి ఏం కావాలో మనమే సైనికులం
మహా సంకల్పానికి ప్రమిదలో నూనె పోసి
అక్షరదీపం వెలిగించాలి ప్రపంచాన్ని జయించాలి
గుడిసె కొప్పు శిఖరం మీద గుమ్మడిపువ్వు నవ్వు
బతుకు నలుపు వాకిట్ల బంతిపూల పరిమళం
ఆంగ్లంలో ముందడుగు బడుగుల స్వప్నం
పూలే అంబేద్కర్ల మహా స్వప్నం
(గౌరవ ముఖ్యమంత్రి
కేసీఆర్ వనపర్తిలో
‘మన ఊరు-మన బడి’ ప్రారంభిస్తున్న సందర్భంగా..)
– వనపట్ల సుబ్బయ్య
94927 65358