ఎన్నో వేల యేండ్ల కిందటే తెలుగు మట్టి నేల పైన మౌఖికమైన బాల సాహిత్యం పరిఢవిల్లింది. అనేకమంది కవులు, రచయితలు ప్రాచీన కాలం నుంచే కాక , ఆధునిక కాలంలో కూడా బాల సాహిత్యానికి సంబంధించిన వివిధ ప్రక్రియలలో సేద్యం చేస్తున్నారు. బాల సాహిత్యం ద్వారా పసితనంలోనే పిల్లల హృదయాల్లో విజ్ఞాన బీజాలు నాటవచ్చు. దానివల్ల మన సంస్కృతి సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు వారి కి తెలుస్తాయి . భాషా పరిజ్ఞానం పెరుగుతుంది. తద్వారా అనేకమంది పిల్లలు తమ ఊహాశక్తికి పదును పెడుతూ రచనలు చేయడం జరుగుతుంది. ఇది బాల సాహిత్యంలో ఒక విప్లవాత్మకమైన మార్పు. దీన్ని సాహిత్య రంగంలో నూతన ఒరవడిగా భావించవచ్చు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించినంక మన బడి పిల్లలు కవులుగా,రచయితలుగా పుస్తకాల రూ పంలో అచ్చవుతున్నారు. బాల్యం నుంచే బాల బాలికల్లో బాల సాహి త్యం పట్ల అభిరుచిని కలిగించినట్లయితే భవిష్యత్తులో మంచి నడవడిక గల పౌరు లుగా ఎదుగుతారనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకు బడులే బాలసాహిత్యానికి కేంద్ర బిందువులవ్వాలి. బడి అనే గుడిని కేంద్రంగా చేసుకొని బాల సాహి త్యం విస్తృతంగా సృజన జరిగి తీరాలి. దానికి గ్రంథాలయాలు, బాలసభలు, బాల కవి సమ్మేళనా లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. అప్పుడే విద్యార్థుల్లో భాషాభిమా నం పెరుగుతుంది. బాల సాహిత్యం రాస్తే ఏమొస్తది? అనే భావన ఇప్పటికీ సమాజంలో, చాలామంది ఉపాధ్యాయులలో నాటుకుని ఉన్న ది. ఇది సరైన భావన కాదు. మంచి సమాజం రాణించాలన్నా, విలువలు గల వ్యక్తులుగా ఎదగాలన్నా బాల సాహిత్యం అందుకు ఎంతగానో దోహదపడుతుంది. బడినే కేంద్రంగా చేసుకొని, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వంలో కృషి జరిగినప్పుడే బాల సాహిత్యం వర్ధిల్ల గలదు. అందుచేత పాఠశాలలే వేదికలుగా సాహిత్యోపాధ్యాయులు, భాషో పాధ్యాయు లు, బాల సాహితీవేత్తలు ముఖ్య భూమిక పోషించాలె .
ఇవ్వాల విద్యార్థులు నేర్చుకునే స్థా యి నుండి రాసే స్థాయికి ఎదిగారనడంలో అతిశయోక్తి లేదు. అనేక పాఠశాలల నుండి పిల్లలు రాసిన వందల కొద్ది పుస్తకాలు ఆవిష్కృతమయ్యాయి. ఇది గొప్ప పరిణామంగా భావించాలి. ఇటీవల తెలంగాణ సాహిత్య అకాడమీ చేపట్టిన రచన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా పిల్లల నుంచి అ నూహ్య స్పంద న లభించింది. దీనివెనక ఎంతో మంది ఉపాధ్యాయుల, బాల సాహితీవేత్తల కృషి దాగి ఉన్నది.
బాల సాహిత్యాన్ని మొదట సృశించింది అమ్మ. తల్లే బాల సాహిత్యానికి తొలి రూపకర్త. ఆమే బాల సాహిత్యా న్ని పలకరించింది. లాలి పాటలు, జోల పాటల ద్వారా తొట్టెలలో తమ పిల్లలకు చిలకరించింది. ఆ తర్వాత భాషావేత్తలు అనేకమంది బాల సాహి త్య రంగంలో కర్తలుగా, సేకర్తలుగా పని చేశారు. చందమామ, జాబిల్లి, బాలమిత్ర, బాలభారతం లాంటి పుస్తకాలు బాల సాహిత్యాన్ని పండించాయి.
బాల సాహిత్య వికాసం కొరకు విశేషంగా కృషి చేశాయి. ఆకాశవాణి కూడా బాలానందం పేరిట బాల సాహిత్యాన్ని పరిచయం చేసింది. అంతే కాకుండా బాల ల అకాడమీ కూడా అద్భుతమైన కృషి కొనసాగించింది. అదేవిధంగా చాలా సంస్థలు, సాహితీవేత్తలు, భాషాభిమానులు, ఉపాధ్యాయ లోకం పిల్లల అభ్యసన అభివృద్ధి కొరకు దోహదపడే బాల సాహిత్యాన్ని వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. నూతన పాఠ్యపుస్తకాలలోనూ, హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలోనూ బాల సాహిత్యానికి మన రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది.అయినప్పటికీ బాల సాహి త్యం అనుకున్నంత స్థాయిలో పిల్లలకు చేరువవుతలేదనే విమర్శ కూడా ఉన్న ది. అందుకు పాఠశాలలు, ఉపాధ్యాయులు ఇంకా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి:94415 61655
(ఈ నెల 24, 25 తేదీలలో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యం లో హైదరాబాదులో జరిగే బాల సాహిత్య సమ్మేళనం సందర్భంగా)