శనివారం 19 సెప్టెంబర్ 2020
Editorial - Apr 13, 2020 , 23:09:39

ఓ మానవుడా!

ఓ మానవుడా!

కంటి మీద కునుకు లేదు

కన్నవారిని కాచే గతి లేదు

దిశ దిశలో దశ దశగా

పెరుగుతున్న విష కణం

ఆదమరిచావా మరణం..!

కన్నులార్పని రక్షక దళం

సంరక్షించే వైద్య శిబిరం

అంతా మనకోసమే కదా..!

ప్రతి నోటా సంభాషణ

ప్రతి చోటా సంరక్షణ

అణువణువునా పర్యవేక్షణ

అంతా మనకోసమే కదా..!

బాధ్యతగా పయనిద్దాం

దేశాన్ని రక్షిద్దాం

ప్రపంచాన్ని మేలుకొల్పుదాం

భారతమాతకు జై కొడుదాం...


logo