గురువారం 02 ఏప్రిల్ 2020
Editorial - Mar 24, 2020 , 22:45:08

మనిషి దేవుడని ప్రకటిద్దాం!!

మనిషి దేవుడని ప్రకటిద్దాం!!

ఇప్పుడు

చేయిచేయి కలపడం కన్నా

చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడమే ముఖ్యం

దగ్గరవ్వడం కన్నా

కాస్తంత దూరంగా ఉండడమే మేలు


దేహాలు 

దూరమైనంత మాత్రాన

మనసులు దూరమైపోవు కదా??


కంటికి కనబడనిదేదో

మనకు తెలియకుండానే దేహంలోకి చొరబడి

ఊపిరి తీసేస్తుందన్నప్పుడు

నీకు నువ్వూ నాకు నేనూ  బందీగా ఉండటమే మంచిది


కనబడే శత్రువైతే

ఎదురుపడి పోరాటం చేయొచ్చు

కనబడని శత్రువుతో ఎట్ల??


సాగుతున్న మృత్యువు క్రీడలో

మనిషే మనిషికి తోడుండాలి

మనిషే మనిషికి అండై నిలబడాలి

మనిషే మనిషికి దేవుడవ్వాలి


రండి..

ఇవ్వాలనే కాదు

ప్రతిరోజూ ’అతడికి’ చప్పట్లుకొట్టి మనసారా అభినందిద్దాం

మనిషే దేవుడని నిర్భయంగా ప్రకటిద్దాం!!


-  బిల్ల మహేందర్‌ 

91776 04430


logo
>>>>>>