శుక్రవారం 03 ఏప్రిల్ 2020
Editorial - Feb 11, 2020 , 23:03:42

పౌరసత్వానికి ఎసరు...?

పౌరసత్వానికి ఎసరు...?

నేను పక్కా హిందువునే కానీ సెక్యులర్‌ హిందువును. మతస్వేచ్ఛను గౌరవించేవాడిని. భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవాడిని. ఎన్నార్సీని వ్యతిరేకించే వివిధరాష్ర్టాల ముఖ్యమంత్రులు, నాయకులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటుచేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం ఆయన ప్రజాస్వామిక దూరదృష్టికి ప్రబల నిదర్శనం. మత సామరస్యం, మతస్వేచ్ఛ ఎలా ఉండాలో కేసీఆర్‌ తన ఆరేండ్ల పాలనలో చేసి చూపించారు.

భారత రాజ్యాంగంలో మత, భావప్రకటనా స్వేచ్ఛలు పొందుపరుచబడ్డాయి. మతాతీతంగా బతికితే మంచిదే. కానీ అం త చైతన్యం ప్రజలందరిలో లేదు. కాబట్టే ఇష్టమైన మతా న్ని ఎన్నుకునే స్వేచ్ఛ ప్రతి పౌరుడికీ ఉన్నది. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాస్వామిక ప్రభుత్వాలు దేశాలను ఏలుతున్న కాలంలో ప్రజల దేశాలుంటాయి కానీ మత దేశాలుండవు, ఉండకూడదు.


భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమున్న దేశం. వివిధ మతాలు, భాష లు, సంస్కృతులు, విభిన్న దృక్పథాలు, వివిధ సామాజిక పరిస్థితులు, చారిత్రక భౌగోళిక పరిస్థితులున్న దేశం. ఇన్ని విభిన్న పరిస్థితులున్నా దేశాన్నంతా ఏకంగా ఉంచే, ఉంచగలిగే ఏకత్వ భావన భారతీయత. రాజ్యాంగంలో భారతదేశ పౌరసత్వం గురించి స్పష్టమైన విధానాలే ఉన్నాయి. వాటికి కొన్ని సవరణలూ జరిగాయి. పొరుగుదేశాల వారు వలసలుగా, శరణార్థులుగా వచ్చినపుడు పౌరసత్వం ఎలా పొందుతార న్న విషయాలూ పొందుపరుచబడినాయి. వీటిలో కుల, మత సంబంధమైన వివక్షను చూపాల్సిన అవసరమూ లేదు. కానీ ఇటీవలి కాలంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న సీఏఏ, ఎన్నార్సీ చట్టాలన్నీ తమ దేశంలో తాము పౌరులమేనని నిరూపించుకోవాల్సిన అవసరాన్ని ముందుకు తెచ్చాయి. ఇది ఈ దేశ మూలాల, మూలవాసుల మూలాలున్న బౌద్ధం, ముస్లిం, క్రైస్తవ మైనారిటీలను, సంచారజాతులను అవమానించడమే.


అక్రమ చొరబాటుదారుల, టెర్రిస్టుల ఏరివేత కోసమని చెప్పబడే ఈ సవరణలు, చట్టాలు మైనారిటీ మతస్థులపై, మూలవాసులు, ఆదివాసీలపై, సంచారజాతులపై ఎక్కుపెట్టిన అస్ర్తాలుగానే అందరూ భావిస్తున్నా రు. ఈశాన్యరాష్ర్టాల్లో గాని, కశ్మీర్‌లో గాని అక్రమ చొరబాటుదారులను గుర్తించడానికి, తీవ్రవాదులను ఏరివేయడానికి ఇప్పుడున్న చట్టాలు చాలు. ఆ పని చేస్తున్నారు కూడా. అయినా ఇవన్నీ ఎందుకు? ఈ చట్టా ల ద్వారా పౌరసత్వం నిరూపించుకోవడానికి పూర్తిచేయవలసిన ఖాళీలు పూరించడం ఎవరివల్లనైనా అవుతుందా? వీటన్నిటినీ చూస్తుంటే మతస్వేచ్ఛను కాదని మైనారిటీలను, హిందూయేతర మతస్థులను వేధించ డం దేశాన్ని మతదేశంగా మార్చడమే ధ్యేయంగా కనబడుతున్నది. 


వేదమతం, బ్రాహ్మణ మతం, శైవ, వైష్ణవం.. రకరకాలుగా పిలువబడి హిం దూమతంగా స్థిరపడిన మతంలో కులవివక్ష, సామాజిక అంతరాలు, విద్యను నిరాకరించడం, అంటరానితనం లాంటి సాంఘిక దురాచారాల వల్ల ఈ దేశ శూద్రులు కొద్దిమంది, అతిశూద్రులు అధిక సంఖ్యలో బౌద్ధులయ్యారు. ఇస్లాం స్వీకరించారు. క్రైస్తవం స్వీకరించారు. 99  భారతీయ బౌద్ధుల, ముస్లింల, క్రైస్తవుల మూలాలు భారతీయ శూద్ర, అతి శూద్ర కులాల్లో ఉన్నాయి. వీరితో పాటు ఆదివాసీలు, మూలవాసులు, సంచారజాతులపై పౌరసత్వ చట్టం పేరు మీద వివక్ష చూపడం సరైందేనా?


ఇందులో ఏ మర్మమూ లేకుంటే బీజేపీ నాయకులు చెప్పినట్టు అందరికీ మేలు చేసేదే అయితే దేశవ్యాప్తంగా మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎందుకింత వ్యతిరేకత వస్తుంది? అసోంలో లక్షలాదిమంది పునరావాస కేంద్రాల్లో ఎందుకు మగ్గాల్సివస్తుంది? ఆ కాలంలో అంటరానితనం పేరు మీద కొంతమందిని గుడికి, బడికి, ఊరికి దూరంగా ఉం చడం ఎంత అమానవీయ చర్యో ఇప్పుడు పౌరసత్వ చట్టం పేరు మీద కోట్లాదిమందిని దూరంగా ఉంచాలనుకోవడం అంత అమానుషమైందే.


ఈ చట్టం సరైందికాదని, అమలుచేయకూడదని దేశమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగానూ నిరసనలు తెలుపుతున్నారు. వేలాది మేధావులు, నోబెల్‌ బహుమతి విజేతలు, రచయితలు, ప్రజాస్వామికవాదులు ఈ చట్టం వద్దని తీర్మానాలు చేసి పంపుతున్నా రు. ఈ చట్టం వల్ల ముస్లిం మైనారిటీలు, క్రైస్తవ మైనారిటీల్లో అభద్రతాభావం నెలకొంది, కోట్లాదిమందికి తమ పౌరసత్వం నిరూపించుకోవడమేలాగో అర్థం కాక భయం పట్టుకున్నది. దేశంలోని సగానికి పైగా రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ మిత్రపక్షాలు కూడా కొన్ని దీన్ని వద్దంటున్నాయి. 


నేను పక్కా హిందువునే కానీ సెక్యులర్‌ హిందువును. మతస్వేచ్ఛను గౌరవించేవాడిని. భారత రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్నవాడిని. ఎన్నార్సీని వ్యతిరేకించే వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులు, నాయకులతో హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తాన ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించడం ఆయన ప్రజాస్వామి క దూరదృష్టికి ప్రబల నిదర్శనం. మత సామరస్యం, మతస్వేచ్ఛ ఎలా ఉండాలో కేసీఆర్‌ తన ఆరేండ్ల పాలనలో చేసి చూపించాడు. సీఏఏ వల్ల మతసామరస్యానికి, మైనారిటీలకు జరిగే నష్టాన్ని అంచనా వేశాడు. కాబట్టే కేసీఆర్‌ దేశ ముఖ్యమంత్రులందరి కంటే ముందుగా హైదరాబా ద్‌లో సమావేశం పెడుతానని సూచన చేశారు.


సున్నితమైన మతవిశ్వాసాలు, రాజ్యాంగంలో పొందుపరిచిన లౌకికత్వం విషయంలో ఎలా ఉండాలో మిగతాపార్టీలు ముఖ్యంగా బీజేపీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి నేర్చుకోవాలి. కేసీఆర్‌ పాలనాకాలంలో మత సంబంధమైన ఏ చిన్న అఘాయిత్యమూ తెలంగాణలో జరుగలే దు. తాను హిందువునని సగర్వంగా చెప్పుకుంటూనే అన్ని మతాలనూ, విశ్వాసాలనూ అక్కున చేర్చుకున్నాడు. అన్ని మతవిశ్వాసాలకు సమాన ప్రాధాన్యం ఇచ్చాడు. బుద్ధవనం స్థాపన చేసి, విశేషంగా నిధులిచ్చి బౌద్ధంపై విశ్వాసం కలవారిని ప్రోత్సహించాడు. బౌద్ధ పరిశోధనా కేం ద్రంలో బౌద్ధంపై చక్కని పరిశోధనలు జరుగుతున్నాయి.


ఇస్లాం మతస్థులైనా వారి మూలాలు దళితుల్లో, వెనుకబడిన కులాల్లో ఉన్నాయన్న వాస్తవం కేసీఆర్‌కు తెలుసు. అందుకే ముస్లింలకు రిజర్వేషన్లు  పెంచుతా మన్నారు.. అది కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉన్నా తన వంతు బాధ్యత నిర్వహించాడు. యాదాద్రి లాంటి అంతర్జాతీయస్థాయి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నిర్మిస్తూ, హిందూ దేవాలయాలను బాగు చేస్తూ హిందువులకు ఆదెరువవుతున్నాడు. బతుకమ్మ లాంటి ప్రకృతి పండుగను అంతర్జాతీయస్థాయి పండుగగా తీర్చిదిద్దడానికి దాన్ని రాష్ట్ర పండుగగా గుర్తించారు. బతుకమ్మ పండుగ రోజు స్త్రీలందరికీ చీరలు పంచుతూ సబ్బండ బంధువయ్యాడు. క్రైస్తవ మతవిశ్వాసాలను గౌరవిస్తూ క్రిస్‌మస్‌ రోజున ప్రభుత్వం తరపున సామూహిక విందును నిర్వహిస్తున్నా డు.


రంజాన్‌ పండుగను ముస్లిం సోదరులు ధూంధాంగా చేసుకునే వసతిని కల్పిస్తున్నారు. ఇలా వ్యక్తిగా తాను హిందువైనా పాలకుడిగా అన్ని మతాలను గౌరవిస్తూ బౌద్ధ, ఇస్లాం, క్రైస్తవ, సిక్కు, అన్ని మాతాలను ప్రేమిస్తూ మతస్వేచ్ఛను గౌరవిస్తున్నారు. ఇలాంటి పాలకులున్నప్పుడే దేశంలో మతసామరస్యం, రాజ్యాంగంలో పొందుపరుచబడిన మత స్వేచ్ఛ కాపాడబడుతుంది హిందువులైనా దళిత, ఆదివాసీ సంచార బలహీనవర్గాలకు, మైనారిటీలకు భయం గొలిపేదిగా, అభద్రతాభావం కలిగించేదిగా ఉన్న సీఏఏ చట్టం అమలుకాకుండా ఉండటానికి దేశవ్యాప్త ముఖ్యమంత్రుల, నాయకుల సమావేశం ఏర్పాటుచేసే సామర్థ్యం, సైద్ధాంతిక నిబద్ధత కేసీఆర్‌కే ఉన్నది.


తమ పుట్టినతేదీలను కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నవారెంతో మంది ఈ దేశంలో ఉన్నారు. మరణించిన లేదా బతికున్నప్పటికీ ఏ విధంగానూ నమోదు చెయ్యబడని వృద్ధులైన తల్లిదండ్రుల పుట్టినతేదీ ఎలా దొరుకుతుంది? వలసలు వచ్చి దేశదిమ్మరులుగా బతుకుతున్న వారికి, ఈ దేశ సంచారకులాలను, ఫకీర్లకు, గిరిజనులకు, శరణార్థులకు ఆధార్‌కార్డులు, ఓటర్‌ నంబరు, డ్రైవింగ్‌ లైసెన్సులేడుంటాయి? ఇప్పటికీ దేశంలో నలభై ఐదు కోట్లకు పైగా నిరక్షరాస్యులుంటే ప్రభుత్వం అడిగే నిబంధనలన్నీ పూర్తిచేయడం సాధ్యమా? అవన్ని చూపినా ఎన్యూమరేటర్‌ సంతృప్తి చెందకుంటే ఆ వ్యక్తికి పౌరసత్వం రాదు. ఇది ఒకవర్గం వారిని టార్గెట్‌ చేయడానికేనన్న విమర్శలున్నాయి. ప్రపంచదేశాలన్నీ ఇలాంటి చట్టాలు తీసుకొస్తే అమెరికా లాంటిదేశాల్లో ఉన్న కోట్లాదిమంది భారతీయులేం కావాలి?


మతం ఏదైనా దాన్నో జీవనవిధానంగా మాత్రమే భావించి సర్వమత, సర్వమానవ సౌభ్రాతృత్వంతో మనుషిలా బతికే వ్యవస్థ కావాలి. మనుషుల మధ్య ప్రేమను పెంచే జీవనవిధానం కావాలి కానీ, పరస్పరం ద్వేషించుకునేది కాదు. వీటన్నిటిపైనా స్పష్టమైన అవగాహన, ఆచరణశీలత ఉన్న కేసీఆర్‌ అన్ని రాష్ర్టాల నాయకులతో సంప్రదించి హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయడం నేటి తక్షణావసరం. దీనితో కేంద్రంపై ఒత్తిడి పెరిగి సీఏఏ చట్టం గురించి పునరాలోచించే అవకాశం ఉంటుంది.


మతం ఏదైనా దాన్నో జీవనవిధానంగా మాత్రమే భావించి సర్వమ త, సర్వమానవ సౌభ్రాతృత్వంతో మనుషిలా బతికే వ్యవస్థ కావాలి. మనుషుల మధ్య ప్రేమను పెంచే జీవన విధానం కావాలి కానీ, పరస్ప రం ద్వేషించుకునేది కాదు. వీటన్నిటిపైనా స్పష్టమైన అవగాహన, ఆచరణశీలత ఉన్న కేసీఆర్‌ అన్నిరాష్ర్టాల నాయకులతో సంప్రదించి హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేయడం నేటి తక్షణావసరం. దీని తో కేంద్రంపై ఒత్తిడి పెరిగి సీఏఏ చట్టం గురించి పునరాలోచించే అవకాశం ఉంటుంది.


logo