శనివారం 04 ఏప్రిల్ 2020
Editorial - Feb 06, 2020 , 23:18:52

సుస్థిరాభివృద్ధి ఎట్లా సాధ్యం?

సుస్థిరాభివృద్ధి ఎట్లా సాధ్యం?

కేటాయింపుల్లో పట్టణాభివృద్ధికి కోత విధించారు. అందులో ముఖ్యంగా ప్రపంచ నగరాలతో పోటీపడి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ లాంటి నగరానికి గత సంవత్సరం కంటే పట్టణాభివృద్ధికి ఇచ్చే నిధుల్లో 14.03శాతం కోత పెట్టారు. ఇలాంటి పరిస్థితులలో పారిశ్రామిక ప్రగతి,ఉద్యోగ కల్పన సంపద సృష్టి అనే పదాలు పెదాలు దాటుతాయా అని అనుమానించాల్సి వస్తున్నది.

సుదీర్ఘ కేంద్ర విత్తమంత్రి బడ్జెట్‌ ప్రసంగం అనంతరం దేశంలోని దాదాపు 3లక్షల 50వేల కోట్లను మదుపరులు స్టాక్‌మార్కెట్‌లో కోల్పోవలసి వచ్చింది.  దీంతో భారత ఆర్థికాభివృద్ధి ఐదు ట్రిలియన్‌ డాలర్ల ప్రశ్నలుగా మిగిలాయి. ఇప్పటికే అమెరికా, చైనా మధ్య వాణిజ్యయుద్ధం, ముడిచమురు సంక్షోభం, అధికవడ్డీ రేట్లతో ఆర్థికంగా ప్రపంచదేశాలు తీవ్ర సంక్షోభంతో సతమ తమౌతున్నాయి.


ఈ ప్రపంచ మాంద్యం భారత్‌పై కూడా పడింది. ఈ మాంద్యంతో పాటు ఇటు దేశంలో ఆటోమొబైల్‌ రంగంలో అమ్మకాలు పడిపోయాయి. రియాల్టీలు కుంచించుకపోవడం వలన స్టీల్‌, సిమెంటు తదితర 41అనుబంధరంగాలపై ప్రభావం చూపుతున్నది. సేంద్రియ ఉత్పత్తులు పెరిగిపోయాయి. ఎఫ్‌యంజీసీ ఉత్పత్తులు పెరిగినా నిల కడలేని వ్యాపారం వలన దేశీయ స్థూలఉత్పత్తి 11 ఏండ్ల కనిష్ఠానికి చేరింది. అజీంప్రేవ్‌ుజీ సర్వే నివేదిక ప్రకారం 2016-18 మధ్యకాలం లో సగటున రోజుకు 6,849 మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వచ్చింది. అంటే ఈ కాలంలో 50 లక్షల ఉద్యోగులను యాజమాన్యాలు తొలిగించాయి. 


ఇందులో ప్రపంచ ప్రఖ్యాత టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహేంద్రా లాంటి కంపెనీలు ఉండటం గమనార్హం. ఇది దేశంలో ఆర్థికఉత్పత్తి లేమి, ఉద్యోగకల్పన లేమిని సూచిస్తున్నది. దీనికితోడు కొత్తగా కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్నది. ఈ వైరస్‌ కారణంగా ప్రపంచ రెండవ అతి పెద్ద ఆర్థిక ,ఉత్పత్తి రంగంలో అతి పెద్ద దేశమైన చైనా నేడు ఇతర దేశాలతో వ్యాపార సంబంధాలు లేక ఎగుమతి, దిగుమతులు పడిపోయి వస్తువు ధరలు ఆకాశంవైపు చూస్తున్నాయి. ఈ దేశం నుంచి ఏటా టూరి జం మీద చాలా పెద్ద మొత్తంలో ప్రజలు ఖర్చు పెడుతారనే భావన ఉన్నది. 


2018 లెక్కల ప్రకారం 15 కోట్ల మంది చైనా దేశానికి చెందిన యాత్రికులు ప్రపంచంలో ఏదో ఒకచోటికి యాత్ర చేశారు. దీని విలువ 277బిలియన్‌ డాలర్లు ఆ దేశ ప్రజలు ఖర్చు పెడుతున్నారు. అలాగే ఆటోమొబైల్‌, స్పిరిట్‌, విలాసవంతమైన వస్తువులు పెద్దఎత్తున కొనుగో లు, అమ్మకాలు జరుపుతారు. ఇతర దేశాలకు సంబంధించిన ఉత్పత్తులను కూడా ఆహ్వానిస్తారు. అలాంటి దేశంలో ఇప్పుడు అత్యవసర ప్రయాణాలు మాత్రమే చేస్తున్నారు. ఐకియా, కేఎఫ్‌సీ, ఫిజ్జా లాంటి సంస్థలు తాత్కాలికంగా కొన్ని ప్రాంతాల్లో వారి వ్యాపారాలను బంద్‌ చేశాయి. ఇలా కరోనా వైరస్‌తో చైనాలో ఆర్థిక మాంద్యం ఏర్పడడానికి అవకాశం ఉన్నది. అది ప్రపంచ మాంద్యంగా మారిపోయే ప్రమాదం కూడా పొంచి వున్నది. ఇది భారతదేశ ఆర్థికంపై కూడా ఉండే అవకాశం ఉన్నది. 


ఇలాంటి పరిస్థితుల్లో ఒకవైపు ప్రపంచ ఆర్థిక మాంద్యం, ఇంకోవైపు మందగిస్తున్నది. మరోవైపు ఉద్యోగాలు లేకపోవడం లేదా ఉద్యోగాలు  తీసివేస్తున్నారు. ఇలాంటి కఠినమైన సమస్యల నేపథ్యంలో కేంద్ర ప్రభు త్వం బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌లో తాత్కాలిక కేటాయింపులు చేసింది. ఇది దీర్ఘకాలికంగా దేశానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ సెలవిస్తున్నారు.  ఇందులో భాగంగా టెక్స్‌టైల్‌ ఇండస్ట్రీస్‌కు 1450 కోట్లు, అంకురాల పెట్టుబడి 25 కోట్ల నుంచి 100 కోట్లకు పెంచింది. 


పారిశ్రామికాభివృద్ధికి 27300 కోట్లు కేటాయించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కోసం 3000 కోట్లు, డెటా సెంట ర్ల పార్కులను ఏర్పాటు చేయడం, ఫోన్‌, సెమి కండక్టర్‌, ఎలక్ట్రానిక్‌ వస్తువులకు ఊతం ఇవ్వడం, లక్ష సైబర్‌ నెట్‌ విలేజ్‌లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అలాగే 100 ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేయడం జిల్లా కేంద్రాల ద్వారా ఎగుమతి కేంద్రాలను ఏర్పాటు చేయడం లాంటి కార్యక్రమాలు మంచివే. అయినప్పటికీ కేటాయింపులు మాత్రం అనుకున్న టార్గెట్‌ 10శాతంగా ఉన్నాయి. పాతగౌనుపై నకిలీ నగలు వేసుకున్నట్లు గా బడ్జెట్‌లో చిన్న చిన్న మెరుపులు మెరిపించారు. 


ఈ బడ్జెట్‌పై అనేకరంగాలకు సంబంధించిన వ్యక్తులు, సంస్థలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారు అనుకున్న మేరకు కేటాయింపులు, కొత్త ప్రతిపాదనలు బడ్జెట్‌ రూపంలో రాలేదు. దీంతో అటు షేర్‌ మార్కెట్‌, ఇటు రాష్ర్టాలు తీవ్ర నిరాశ చెందాయి. మరోవైపు నిరుద్యోగులు నిరుత్సాహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో  సుస్థిరాభివృద్ధి ప్రస్తుత బడ్జెట్‌తో ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.    


వీటిటో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. అయితే ఇప్పటికే అనేకరాష్ర్టాల్లో వీటికి సంబంధించిన కార్యక్రమాలు అమలవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికి ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టెక్స్‌టైల్‌ పార్కులను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నారు. స్కిల్‌ డెవలప్‌మెంటును ప్రోత్సహించడానికి ఫినిషింగ్‌ స్కూల్‌ను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్రం ప్రకటించిన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో పాత కార్యక్రమాలే. వీటిని కొత్తగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రధానం గా ప్రస్తావించడం అభినందనీయమే. అయితే వాటిని అమలు చేయ డానికి  ఒక విజన్‌ లేకపోవటం శోచనీయం.


వరుసగా ఆరవ త్రైమాసికంలో దేశ జీడీపీ తక్కువ నమోదైంది. ఇదే విధమైన ఆర్థికాభివృద్ధితో ముందుకు వెళితే 2025 నాటికి ఐదు లక్షల ట్రిలియన్‌ డాలర్ల వృద్ధి మరో తొమ్మిదేండ్లు ఆలస్యం అవుతుంది. అది అనుకున్న సంవత్సరానికి 3.49 లక్షల ట్రిలియన్‌ డాలర్లవద్దే వృద్ధి ఆగిపోయే అవకాశం ఉన్నది. ఈ మాంద్యాన్ని జయిస్తూ చైనా, వియత్నాం, ఈజిప్టు, కొరియా లాంటి దేశాలు వారికి అనుకూలమైన దేశీయ ఉత్పత్తి విధానాలన్ని అవలంబిస్తూ దినదినాభివృద్ధి సాధిస్తున్నాయి. అందులో ముఖ్యంగా వియత్నాం లాంటి చిన్న దేశం కూడా దేశీయ వస్తు ఉత్పత్తి ఎగుమతిలో 2000-18 మధ్య వారి దేశీయ ఎగుమతి ఎనిమిది రెట్లు పెరిగాయి. 


కానీ మన దేశంలో మేక్‌ ఇన్‌ ఇండియా లాంటి కార్యక్రమాలతో రెండు రెట్లు మాత్రమే. ఈ 18 నెలల కాలంలో దేశీయ ఉత్పత్తి, ఎగుమతి పెరిగింది. ఇన్ని సమస్యలు ఉన్నా కూడా బడ్జెట్‌లో కొత్త ఆర్థిక విధానాలు కానీ, సంస్కరణలు కానీ ముందుకు తీసుకరాలేదు. ఇది దేశా భివృద్ధికి ఆటంకమే. 100 లక్షల కోట్లతో 6500 ప్రాజెక్టులను, ఐదు ఆకర్షణీయ నగరాలు చేస్తామని ప్రకటించారు. కానీ కేటాయింపుల్లో పట్టణాభివృద్ధికి కోత విధించారు. అందులో ముఖ్యంగా ప్రపంచ నగరాలతో పోటీపడి శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌ లాంటి నగరానికి గత సంవత్సరం కంటే పట్టణాభివృద్ధికి ఇచ్చే నిధుల్లో 14.03శాతం కోత పెట్టారు.


ఇలాంటి పరిస్థితులలో పారిశ్రామిక ప్రగతి, ఉద్యోగ కల్పన సంపద సృష్టి అనే పదాలు పెదాలు దాటుతాయా అని అనుమానించాల్సి వస్తున్నది. ఎఫ్‌యంజీసీ కింద చిన్న పరిశ్రమలను ఏర్పాటు చేసుకునే సంస్థలను కోటి నుంచి ఐదు కోట్లకు పెంచారు. అది కొంతవరకు చిన్న పరిశ్రమలకు తోడ్పాటునిచ్చేదే. అయినా గత ఆరేండ్లుగా ఉత్పత్తి రంగం విలువ తగ్గింది. దీనివల్ల అనేక రాష్ర్టాలు తమ ద్రవ్యాన్ని కోల్పోవాల్సి వస్తుంది. దీంతో అనేక సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు వెచ్చించే నిధులను కేటాయింపులను తగ్గించుకునే పరిస్థితి వచ్చింది. 


ఈ బడ్జెట్‌పై అనేకరంగాలకు సంబంధించిన వ్యక్తులు, సంస్థలు భారీగా ఆశలు పెట్టుకున్నారు. కానీ వారు అనుకున్న మేరకు కేటాయింపులు, కొత్త ప్రతిపాదనలు బడ్జెట్‌ రూపంలో రాలేదు. దీంతో అటు షేర్‌ మార్కె ట్‌, ఇటు రాష్ర్టాలు తీవ్ర నిరాశ చెందాయి. మరోవైపు నిరుద్యోగులు నిరుత్సాహంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో సుస్థిరాభివృద్ధి ప్రస్తుత బడ్జెట్‌తో ఎలా సాధ్యం అవుతుందని ప్రశ్నిస్తున్నారు. భవిష్యత్తుపై ఆందో ళన చెందుతున్నారు.    

(వ్యాసకర్త: కాకతీయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు)


logo