తెలుగుయూనివర్సిటీ : సింగిడి సాంస్కృతిక సంస్థ ఆధ్వర్యంలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, పర్యాటక శాఖల సౌజన్యంతో నగరంలో నవంబర్ 24న సింగిడి యువ, వివిధ రంగాలలో ప్రతిభ కలిగిన వారికి విశిష్ట ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు సింగిడి డైరక్టర్ డి.ఆర్.కె విశ్వకర్మ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను విశ్వకర్మ, సురేష్ గోపతి (లండన్) లతో కలిసి భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరిక్రిష్ణ ఆవిష్కరించారు. శ్రీలంక సాంప్రదాయ నృత్యాలు అంజన రాజపాక్షే బృందం, ఉత్తర భారత నృత్యం అకాంచ ప్రియదర్శిని బృందం, ఒడిస్సీనృత్యం జ్యోతిర్మాయి పట్నాయక్‌లు ప్రదర్శిస్తారని ఆయన వెల్లడించారు.