హయత్‌నగర్ రూరల్, డిసెంబర్ 11: అభివృద్ధి పనుల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని ఐదు గ్రామాల్లో రూ.3 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతామని తెలిపారు. తారామతిపేట, గౌరెల్లి, కుత్బుల్లాపూర్ తదితర గ్రామాల్లో రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, మార్కెట్ యార్డులు తదితర అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్టు చెప్పారు. కమ్యూనిటీ హాళ్లు కావాలంటూ యువత విజ్ఞప్తులు చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా ముందుకువెళ్తామని చెప్పారు. డంపింగ్ యార్డు అవతలి వైపునకు మార్చాలని తారామతిపేట గ్రామస్తులు విజ్ఞప్తి చేశారని చెప్పారు. స్థానికులు శ్రమదానంతో రోడ్డు పనులు చేపడితే.. డంపింగ్ యార్డును మార్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బాటసింగారం రైతు సేవా సహకార సంఘం చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, కుత్బుల్లాపూర్, గౌరెల్లి, తారామతిపేట సర్పంచ్‌లు స్వరూప, తుడుము మల్లేశ్, మహేశ్, గౌరెల్లి ఉపసర్పంచ్ వేముల చంద్రశేఖర్, టీఆర్ఎస్ నాయకులు వీరస్వామియాదవ్, జిల్లా సహకార బ్యాంకు కోఆప్షన్ సభ్యులు మహ్మద్అక్బర్ అలీఖాన్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాల అభివృద్ధే లక్ష్యం
అబ్దుల్లాపూర్‌మెట్ : గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కవాడిపల్లి, బలిజగూడ, బాచారం గ్రామాల్లో చేపట్టిన వైకుంఠధామాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లను ఎంపీపీ బుర్ర రేఖామహేందర్‌గౌడ్, వైస్ ఎంపీపీ కొలన్ శ్రీధర్‌రెడ్డితో కలిసి శనివారం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కవాడిపల్లిలో రూ. 49.10 లక్షలు, బలిజగూడలో రూ. 16.60 లక్షలు, బాచారంలో రూ. 16.60 లక్షలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గంలోని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయన్నారు. బాచారం గ్రామంలో పింఛన్లు, రేషన్ కార్డులు లేక ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఎమ్మెల్యేకు వివరించారు. అందుకు స్పందించి సదరం సర్టిఫికెట్ ఇప్పించి పింఛన్ అందేలా చూస్తానని తెలిపారు. గ్రామానికి బస్సు సర్వీస్ సక్రమంగా రాక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ పారంద సంతోష, ఉపసర్పంచ్ మోయర ప్రభాకర్ ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ అక్బర్ అలిఖాన్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ లెక్కల విఠల్‌రెడ్డి, సర్పం చ్‌లు దూసరి సుజాత, బుర్ర వీరస్వామిగౌడ్, ఎంపీటీసీ గ్యార బాలలింగస్వామి, ఉప సర్పంచ్‌లు పన్నాల మోహ న్‌రెడ్డి, ఉప్పు సురేశ్, మోర ప్రభాకర్‌ముదిరాజ్, వార్డు సభ్యులు, మండల పార్టీ అధ్యక్షుడు కిషన్‌గౌడ్ పాల్గొన్నారు.