మారేడ్పల్లి : మాతృత్వం మహిళలకు దేవుడు ఇచ్చిన వరం అని, అలాంటి అదృష్టం మరొకటి ఉండదని..సినీ నటి ఇంద్రజ అన్నారు. రైల్నిలయం ప్రాంతంలోని ఫర్టీ-9 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆస్టేలియా యూనివర్సిటీ సహాకారంతో ఏర్పాటు చేసిన అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఫ్రొసీజర్ను ఆమె గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఇంద్రజ మాట్లాడుతూ… ప్రసుత్తం ఆసుపత్రులన్నీ వ్యాపారమయం అయ్యాయని, సంతానలేమి చికిత్సలు అందించే వాటిలో ఇది మరింత ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో సంతానం లేక బాధపడుతూ, అంత డబ్బు ఖర్చు చేయలేని వారికి ఫర్టీ -9 యాబై శాతం రాయితీలు ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
అనంతరం ఫర్టీ-9 లో మహిళా దినోత్సవం సందర్భంగా ఈ నెల 10 నుంచి ఏప్రిల్ 10 వరకు ఐవీఎఫ్లో ఇస్తున్న 50 శాతం రాయితీలను ఆమె ప్రకటించారు. అదేవిధంగా ఫర్టీ-9 సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ సీ. జ్యోతి మాట్లాడుతూ..మారుతున్న జీవన విధానం, వాతావరణంలో మార్పులు, వృత్తిపరమైన ఒత్తిళ్లు తదితర కారణాలతో సంతానం కలుగడటం లేదన్నారు.
ఫర్టీ-9 కు చెందిన అన్ని కేంద్రాల్లో కూడ ఐవీఎఫ్లలో 50 శాతం రాయితీలు అందిస్తున్నామని చెప్పారు.