అంబర్‌పేట : కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణరెడ్డి, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ రజనిలు మంగళవారం అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను గోల్నాకలోని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ప్లంబింగ్, తాపీ మేస్త్రీ, ఎలక్టికల్, తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల వంటి అనేక అసంఘటిత రంగ కార్మికులు కార్మిక సంక్షేమ మండలి చేపట్టే పథకాలను అవగాహన లేక ఉపయోగించుకోలేకపోతున్నారని తెలిపారు.
దీనికి స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే అంబర్‌పేట నియోజకవర్గంలో చేతి వృత్తుల వారికి ఒక పూర్తిస్థాయి అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తామని అధికారులకు తెలిపారు.