నవాబుపేట, డిసెంబర్ 11: తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మండలంలోని ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహంలోని విద్యార్థులకు ప్రైవేట్ హాస్టల్‌కు దీటుగా సౌకర్యాలు అందుతు న్నాయి. ఈ వసతి గృహంలో ఉంటూ పదోతరగతి వరకు చదువుకుంటున్న విద్యార్థులకు సన్న బియ్యంతో వండిన రైస్‌ను వడ్డిస్తున్నారు. ఉదయం లేవగానే విద్యార్థులు వ్యాయామాన్ని ముగించుకుని, అల్పాహారాన్ని తీసుకుని తెలుగు, ఇంగ్లిష్ మా ధ్యమాల పాఠశాలలకు తరలివెళ్తారు. ప్రతిరోజూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు. నవాబుపేట మండలంలోని ఎస్సీ హాస్ట ల్ ప్రస్తుతం వంద మంది విద్యార్థులతో కళకళలాడుతున్నది. విద్యార్థులు నిద్రించేందుకు బెడ్, నోట్‌బుక్స్, ప్రతి ఏడాది నాలుగు జతల బట్టలు, పెన్నులను సమకూర్చుస్తూ ప్రభుత్వం వారిని ప్రోత్సహిస్తున్నది. ప్రతి విద్యార్థికి ప్రతినెలా సబ్బుల బిల్లు రూ.62, అదేవిధంగా 5,8 తరగతుల బాలురకు రూ. 1000, 9, 10 తరగతుల వారికి రూ.3000 చొప్పున ఉపకా ర వేతనాలను ప్రతి ఏడాది ఇస్తున్నది. ఈ హాస్టల్లో వసతులు బాగుండటంతో మండలంలోని పలు గ్రామాలకు చెం దిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన పిల్లలను చేర్చించేందుకు తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. హాస్టల్ లోని ఖాళీస్థలంలో కూరగాయలు, అరటిపండ్లు, బొప్పాయి వంటి పండ్ల మొక్కలను హరితహారంలో భాగంగా వసతి గృహం సిబ్బంది, విద్యార్థులు కలిసి నాటి సంరక్షిస్తున్నా రు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి ఫలాలను ఇస్తున్నాయి. సాయం త్రం సమయంలో విద్యార్థులు ఆ చెట్ల కింద కూర్చుని చదువుకుంటున్నారు.
హాస్టల్లో విద్యార్థులకు ఇచ్చే మెనూ..
వారానికి నాలుగు రోజులు గుడ్లు, ఉదయం సమయంలో పులిహోర, అరటిపండు, తాగేందుకు ఫిల్టర్ నీరు, సాయంత్రం సమయంలో శనిగలు, పెసర్లు, అటుకులు, బూస్ట్, పల్లీపట్టి ప్యాకెట్లను అందిస్తున్నారు.
ప్రభుత్వం వసతులు కల్పిస్తున్నది
ప్రభుత్వం అన్ని వసతులను కల్పిస్తున్నది. కొవిడ్ అనంతరం హాస్టల్లో చాలా మంది విద్యార్థులు చేరారు. విద్యార్థులకు ప్రతిరోజూ పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌ను ఇస్తు న్నాం. విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకుంటున్నారు. హాస్టల్ పరిసరాల్లో విద్యార్థులు నాటిన మొక్కలు ఏపుగా పెరిగి ఆహ్లాదకర వాతావరణం సంతరించుకున్నది.
-సుక్రవర్ధన్రెడ్డి, నవాబుపేట, ఎస్సీ హాస్టల్ వార్డెన్
స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ ఎస్సీ బాలుర వసతి గృహం ఎదుట ఉన్న బీటీ రోడ్డుపై స్పీడ్‌బ్రేకర్లు ఏర్పాటు చేయాలి. ప్రతిరోజూ పాఠశాలలకు వెళ్లే సమయంలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాం. ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్‌కు చెప్పగా, ఉన్నతాధికారులతో మా ట్లాడి ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు.