Covid death | కొవిడ్ మరణమైతే రూ.50 వేల ఎక్స్‌గ్రేషియా : విప్ ఆరెకపూడి గాంధీ

మియాపూర్ : కొవిడ్‌తో మరణించిన కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటున్నదని ప్రభుత్వ విప్ ఆరెక పూడి గాంధీ అన్నారు. కొవిడ్‌తో మరణించిన వారికి ప్రభుత్వ పరంగా రూ. 50 వేల ఎక్స్ గ్రేషియాను అందిస్తుందని ఇందుకు గాను మీసేవా, సర్వీస్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
బుధవారం విప్ గాంధీ ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. కొవిడ్‌తో సంభవించిన మరణాలకు సంబంధించిన బాధిత కుటుంబ సభ్యులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఈ మొత్తం కుటుంబానికి కొంతమేర ఆర్థిక తోడ్పాటుగా నిలుస్తుందన్నారు.
మృతుడి డెత్ సర్టిఫికెట్, ఆధార్‌కార్డు, కొవిడ్ నిర్ధారణ సర్టిఫికెట్, బ్యాంకు పాస్ బుక్ జీరాక్సు, ఫోన్ నంబర్లతో వెంటనే మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని విప్ గాంధీ కోరారు. దరఖాస్తు చేసుకున్న 30 రోజులలో బాధిత కుటుంబానికి ఈ ఎక్స్ గ్రేషియా మృతుడి ఆధార్‌తో అనుసంధానం ఉన్న బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని విప్ తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆరు నెలల్లోనే రేవంత్ మార్ ఆర్థిక వినాశనం
శభాష్ వంశిక.. జాతీయస్థాయి క్రికెట్‌కు ఎంపికైన విద్యార్థినిని అభినందించిన కేటీఆర్
అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ భేటీ మళ్లీ వాయిదా
అప్పుల పాలన.. 6 నెలల్లోనే 72.59% రుణాలు తెచ్చిన రేవంత్ ప్రభుత్వం
చివరి ఆయకట్టుకూ నీళ్లివ్వాలి.. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

