మియాపూర్ : సరస్వతీ కటాక్షం ఉండి లక్ష్మీకటాక్షం లేని పేద విద్యార్థులకు తాను ఎల్లపుడు అండగా నిలుస్తానని, వారి విద్యాపరమైన కలలను నెరవేర్చుకునేందుకు పెద్దన్నలా ఆదుకుంటానని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ అన్నారు.
చందానగర్ డివిజన్ కైలాష్నగర్కు చెందిన భుజంగరావు విజయకుమారి దంపతుల కుమారుడు బాల కౌశిక్ అనే పేద విద్యార్థి ఇంజినీరింగ్ తృతీయ సంవత్సరం కోర్సును అభ్యసించేందుకు కళాశాల ఫీజు రూ. 20 వేలను విప్ ఆరెకపూడి గాంధీ శనివారం తన నివాసంలో విద్యార్థి కుటుంబ సభ్యులకు అందించారు.