Gandhi hospital | గాంధీ దవాఖానలో షార్ట్ సర్య్కూట్‌తో విద్యుత్ కేబుల్ దగ్ధం

బన్సీలాల్‌పేట్ : గాంధీ దవాఖానలో షార్ట్ సర్య్కూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం జరిగి కేబుల్ వైర్లు కాలిపోయాయి. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. వివరాలు ఇలా ఉన్నాయి. బుధవారం ఉదయం 7:20 గంటల సమయంలో దవాఖానాలోని గ్రౌండ్ ఫ్లోర్ మహిళల టాయిలెట్స్, లిఫ్టుల పక్కనే ఉన్న ఎలక్టికల్ గదిలో షార్ట్ సర్య్కూట్ కారణంగా ప్యానల్ బోర్డుల నుండి మంటలు చెలరేగాయి.
కేబుల్ వైర్లు కాలుతూ దట్టమైన పొగ, మంటలతో అవి మొదటి, రెండవ, మూడవ అంతస్తు వరకు వ్యాపించాయి. దాంతో అక్కడ ఉన్న సెక్యూరిటి సిబ్బంది, ఎలక్టికల్ విభాగం సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అప్రమత్తమై వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గాంధీ దవాఖాన ఆవరణలోనే ఉన్న సైఫాబాద్ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిమిషాల వ్యవధిలోనే అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
పొగలు వ్యాపించడంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్రసూతి వార్డులోని గర్భిణీలు, మహిళలు ఆందోళనతో బయటకు పరుగులుతీశారు. రోగులకు ఇబ్బంది కలగకుండా నార్త్ బ్లాక్‌లో ఉన్న ఆర్థోపెడిక్, ఈఎన్టి, ప్లాస్టిక్ సర్జరీ, జనరల్ మెడిసిన్ విభాగంలో ఉన్న రోగులను సౌత్ బ్లాక్‌లలోని పలు వార్డులకు తరలించారు. మిగిలిన వార్డులు, అత్యవసర సేవలు, ఆపరేషన్లు, బయటి రోగుల సేవలు యథావిధిగా కొనసాగాయి.

డిఎంఈ సందర్శన : షార్ట్ సర్య్కూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిన సంఘటనా స్థలాన్ని బుధవారం ఉదయం డీఎంఈ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి, సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావు, బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, టీఎస్ఎంఐడీసీ విద్యుత్ ఇంజనీర్ల విభాగం అధికారులు సందర్శించారు. సంఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
షార్ట్ సర్య్కూట్ కారణంగా స్వల్ప అగ్ని ప్రమాదం జరిగి కేబుల్ వైర్లు కాలిపోయాయిని, అనుకోకుండా జరిగిన ఈ ఘటన లో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదని, రోగులను పక్కనే ఉన్న సురక్షిత వార్డులలోకి తరలించామని అన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్దరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వారు తెలిపారు.

మంత్రి తలసాని విచారణ : ఈ సంఘటన గురించి రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్ప్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బుధవారం ఉదయం గాంధీ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావుతో ఫోన్లో మాట్లాడారు.
వివరాలు తెలుసుకున్నాక తాను ప్రస్తుతం హుజురాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో ఉన్నానని, హైద్రాబాద్ తిరిగి రాగానే, దవాఖానను సందర్శిస్తానని, రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాలని సూచించారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

