తలకొండపల్లి, డిసెంబర్28 : పేద ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మండలంలోని జూలపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌కి రూ. 36 వేలు, కల్వకుర్తికి చెందిన సురేశ్‌కి రూ. 2 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కును మంగళవారం అందజేశారు. పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాగర్‌కర్నూల్ జడ్పీవైస్ చైర్మన్ బాలాజీసింగ్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం
యాచారం : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం పేదలకు వరం లాంటిదని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన దేవరకొండ మౌనికకి రూ.45 వేల సీఎంఆర్ఎఫ్ చెక్కును మంగళవారం క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పథకం ఎంతో మంది పేదలకు అండగా నిలుస్తుందన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోఎన్నో కుటుంబాలను ఆర్థికంగా ఆదుకుందన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటున్నదన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండిమీది కృష్ణ, టీఆర్ఎస్ నాయకులు కృష్ణయ్య, శ్రీనివాస్, ఎట్టి ప్రహ్లాద్, కృష్ణ పాల్గొన్నారు.