గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
హర్షం వ్యక్తం చేసిన అన్నదాతలు
యాలాల, జనవరి 2 : రైతు పక్షపాతి సీఎం కేసీఆర్ అని మండల టీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్‌గౌడ్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వెంకట్‌శ్ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని ముద్దాయిపేట, పెర్కంపల్లి గ్రామాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రైతులు ఇబ్బందులకు గురి కావద్దని ఎకరానికి రూ.10వేల చొప్పున రైతుబంధు పెట్టుబడి సాయం అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మన రాష్ట్రంలో అమలయ్యే పథకాలను ఇతర రాష్ర్టాల్లో అమలు చేయడం మన రాష్ట్ర గొప్పతనాన్ని తెలుపుతుందన్నారు. రాష్ట్రంలోని ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదని రైతు బంధు పథకం ద్వారా అందజేస్తున్న పెట్టుబడి సాయంతో ప్రతి రైతు కండ్లల్లో ఆనందం కన్పిస్తున్నదన్నారు. ఆయా కార్యక్రమాల్లో గ్రామకమిటీ అధ్యక్షుడు జహీరుద్దీన్, అశోక్‌గౌడ్, గోవింద్ పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
వికారాబాద్, జనవరి 2 : రైతుల సంక్షేమం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి ఆదుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులు రుణపడి ఉంటారని వికారాబాద్ మండల అధ్యక్షుడు కమాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ చిట్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయం చేసేందుకు పంట పెట్టుబడికి ఎకరాలకు రూ.10వేలు అందిస్తున్నారన్నారు. మధ్యవర్తులు లేకుండా, ఎలాంటి అప్లికేషన్లు పెట్టకుండా నేరుగా రైతుల ఖాతాలో జమవుతున్నాయన్నారు. సంవత్సరంలో రెండు పంటలకు రూ.10వేల చొప్పున ఎకరాలకు చెల్లించి రైతులను ఆదుకుంటుందన్నారు. ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించి రైతుల కష్టాలను దూరం చేశారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు పురుషోత్తంరెడ్డి, సర్పంచ్‌లు రాములునాయక్, ఆంజనేయులు, మండల ఉపాధ్యక్షుడు గఫార్, మైనార్టీ మండల అధ్యక్షుడు గయాజ్, జైదుపల్లి ఉప సర్పంచ్ సురేశ్‌కుమార్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.