కొడంగల్, జనవరి 2 : మండలంలోని హస్నాబాద్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఎంపీపీ మద్దప్ప దేశ్‌ముఖ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడంతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. పెద్ద బోయిన నారాయణ, శివరాజ్, బోవనప్ప, హన్మప్ప, రాములు, చంద్రప్ప, రాములు, తిరమలమ్మ, ఆశప్ప, మనోహర్, సూర్యప్రకాశ్, మల్లేశ్, వెంకటయ్య, నందకుమార్, సాయిలు తదితరులు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్ఎస్ చేపడుతున్న ప్రజా సంక్షేమానికి ఆకర్శితులై, కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధిని చూసి పార్టీలో చేరేందుకు ముందుకు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి టీఆర్ఎస్ పార్టీ పెద్దపీట వేస్తున్నదని, సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ ప్రగతి ఆధారపడి ఉందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకు నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు, ప్రజలు ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నియోజవర్గంలోని కొడంగల్, బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, మద్దూర్ మండలాల టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.